Thursday, September 10, 2026 07:01 PM
Thursday, September 10, 2026 07:01 PM

బిగ్‌బాస్ 10లో ఎనిమిది వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు? రేసులో ఉన్నది వీళ్లే!

కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘బిగ్‌బాస్ తెలుగు 10’ ఇటీవలే ప్రారంభమైంది. అంచనాలకు మించిన బజ్‌తో దూసుకెళ్తున్న ఈ సీజన్‌లో అప్పుడే కంటెస్టెంట్ల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా త్రిగున్–రోహిత్ మధ్య జరుగుతున్న గొడవలు ‘బాహుబలి–భళ్లాలదేవ’ పోరును గుర్తుచేస్తున్నాయి. ప్రస్తుతానికి షో మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో ఆటను మలుపు తిప్పడం బిగ్‌బాస్‌కు అలవాటు. గత సీజన్‌లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు హౌస్‌లో సృష్టించిన సంచలనం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఈసారి కూడా అదే స్థాయిలో వినోదం, వివాదాలు అందించగల కంటెస్టెంట్లను తీసుకొచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తం ఎనిమిది మందిని వైల్డ్‌కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి పంపే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read : ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌లో సంచలనం..!

ముందుగా ‘అగ్నిపరీక్ష 2’ నుంచి ఇద్దరికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. దీపక్, మితిలేష్, రామకృష్ణ, అపూర్వ పేర్లు పరిశీలనలో ఉండగా, వీరిలో ఇద్దరిని ఎంపిక చేయనున్నారట. ప్రేక్షకుల్లో ఎక్కువమంది రామకృష్ణను వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా చూడాలని కోరుకుంటున్నారు. అయితే బిగ్‌బాస్ బృందం మాత్రం మితిలేష్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మితిలేష్, అపూర్వ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయంలో ఈసారి మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హౌస్‌లో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అది దాదాపు ‘బాయ్స్ హాస్టల్’లా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమతుల్యతను మార్చేందుకు పలువురు మహిళా సెలబ్రిటీలను సంప్రదిస్తున్నారట.

ప్రముఖ సినీ నటి శీరత్ కపూర్‌తోపాటు ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ ఫేమ్ సోనియా, ఆషిక పేర్లు వైల్డ్‌కార్డ్ రేసులో వినిపిస్తున్నాయి. వీరితోపాటు సీరియల్ నటి సౌందర్య రెడ్డి కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పురుష కంటెస్టెంట్ల జాబితాలో నూకరాజు, రాకేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ హౌస్‌లోకి వస్తే వినోదానికి కొదవ ఉండదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. తమ కామెడీ టైమింగ్‌తో షోలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read : చిన్న శ్రీను షాక్‌… కేడర్ ముందే కంటతడి పెట్టిన బొత్స!

మొత్తంగా ఎనిమిది మంది వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లను రంగంలోకి దింపేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరి రాకతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారతాయా? ప్రస్తుతం ఆధిపత్యం చూపిస్తున్న కంటెస్టెంట్లకు కొత్త సవాళ్లు ఎదురవుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత ఓటింగ్‌లో రోహిత్ ‘వార్ వన్‌సైడ్’ అన్నట్లుగా ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రామకృష్ణ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇస్తే రోహిత్‌కు ఓటింగ్ పరంగా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరి ప్రచారంలో ఉన్నవారిలో నిజంగా హౌస్‌లోకి అడుగుపెట్టేది ఎవరు? వారి రాకతో బిగ్‌బాస్ ఆట ఏ మలుపు తిరుగుతుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చిన్న శ్రీను ఎఫెక్ట్.....

ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక నేతగా ఉన్న...

‘సర్దార్ 2’ మూవీ...

తమిళ హీరో కార్తీ కెరీర్‌లోని ఉత్తమ...

వైసీపీ నుంచి సజ్జల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన రాజకీయ...

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు...

తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం...

చిన్న శ్రీను షాక్‌…...

విజయనగరం జిల్లా రాజకీయం ఒక్కసారిగా భావోద్వేగాల...

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లేడీ...

ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా...

పోల్స్