తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన ఆరుగురు అన్నాడిఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలు, పార్టీ మార్పు వ్యవహారంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల రాజీనామాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసును విచారించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రజాప్రతినిధి తన పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లడం లేదా మంత్రి కావడం అనేది రాజకీయ ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేసింది.
Also Read : మళ్లీ.. బొత్స వర్సెస్ కిమిడి..!
ఒక శాసనసభ్యుడు తన స్థానానికి రాజీనామా చేసే హక్కు రాజ్యాంగ పరిధిలోనిదేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. రాజీనామా ఆమోదం పొందడం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయడం అనేవి రెండూ పూర్తిగా వేర్వేరు రాజ్యాంగ ప్రక్రియలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజీనామాలను స్పీకర్ ఆమోదించినంత మాత్రాన, వారిపై ఉన్న అనర్హత పిటిషన్లు చెల్లకుండా పోవని పేర్కొంది. ఈ నేపథ్యంలో, సదరు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read : విజయ్‌పై ట్రోలింగ్‌కు రష్మిక మందన్నా ఘాటు కౌంటర్..!
చట్టప్రకారం ఈ ప్రక్రియను మెరిట్ ఆధారంగా పూర్తి చేయాలని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన విశ్వాస తీర్మానంలో విప్ ధిక్కరించి, ఆ తర్వాత నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకేలో చేరిన ఆరుగురు మాజీ అన్నా డిఎంకె ఎమ్మెల్యేలు, ఎస్. జయకుమార్, మరగతం కుమారవేల్, పి. సత్యభామ తదితరులు ఈ తీర్పుతో సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లయింది.


