Monday, October 26, 2026 06:51 PM
Monday, October 26, 2026 06:51 PM

మళ్లీ.. బొత్స వర్సెస్ కిమిడి..!

2024 అసెంబ్లీ ఎన్నికలు అందరికీ గుర్తే. ఎందుకంటే.. అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. వై నాట్ 175 అని గొప్పగా ప్రకటించారు. అయితే.. చివరికి 11 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఈ ఎన్నికలకు ముందు చాలా మంది వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలకు సవాళ్లు కూడా విసిరారు. పరిటాల వాళ్లు గెలిస్తే మీసం తీసేస్తా అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, గురజాలలో ఓడితే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కాసు మహేశ్ రెడ్డి, నరసరావుపేటలో ఓడితే మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడనని మాజీ మంత్రి అనిల్ యాదవ్.. ఇలా ఎంతో మంది ప్రగల్భాలు పలికారు. అయితే చివరికి వీళ్లంతా ఓడిపోయారు.

Also Read : పోస్టల్ బ్యాలెట్లపై ఎస్‌ఈసీ కీలక ఉత్తర్వులు..!

అయితే ఇలాంటి సవాళ్లు, ప్రతిసవాళ్లు లేనప్పటికీ.. ఆ నియోజకవర్గం మాత్రం రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించింది. అదే చీపురుపల్లి. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం అంటే అది బొత్స కంచుకోట అని అర్థం. 2014లో అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయటం వల్లే బొత్స సత్యనారాయణ ఓడారు. బొత్స కారణంగా చీపురుపల్లిలో వైసీపీ మూడో స్థానానికి పడిపోయింది. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన బొత్స.. గెలిచారు. జగన్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. చీపురుపల్లి నియోజకవర్గంలో చివరి నిమిషం వరకు టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో బొత్సపై పోటీ చేసేందుకు టీడీపీ నేతలు భయపడుతున్నారనే ప్రచారం కూడా వైసీపీ నేతలు తెరపైకి తీసుకువచ్చారు.

2024 ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపారు చంద్రబాబు. దీంతో అంతా.. కళా గెలుపు కష్టమే.. అని జోస్యం కూడా చెప్పారు. కానీ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కళా వెంకట్రావు ఏకంగా 12 వేల ఓట్ల మెజారిటీతో బొత్సపై విజయం సాధించారు. ఇది ఉత్తరాంధ్రలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది కూడా. సత్తిబాబు ఓడిపోయారా.. అని అంతా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తలెత్తింది అనే మాట బాగా వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి బొత్స వర్సెస్ కిమిడి.. పోరు మొదలైంది.

జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బొత్స సత్యనారాయణ భారీ వ్యూహం రచించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కుమార్తె అనూషను తెర్లాం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో దింపారు. గరివిడి నుంచి బొత్స కోడలు పూజిత, గుర్ల నుంచి బొత్స చెల్లెలు లక్ష్మి, పూసపాటిరేగ నుంచి బొత్స తమ్ముడి కుమారుడు చైతన్య ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బొత్స కుటుంబం నుంచి పోటీ చేస్తున్న నలుగురిలో ఇద్దరి గెలుపు ఇప్పుడు బొత్సకు ఇజ్జత్‌కా సవాల్ అన్నట్లుగా మారింది. బొండపల్లి నుంచి పోటీ చేస్తున్న బొత్స అనూష ఓడితే.. అప్పుడు దారుణమైన మాటలు బొత్స పడాల్సి ఉంటుంది. జెడ్పీటీసీగా గెలవలేని అనూష.. భీమిలిలో పోటీ చేసి ఎమ్మెల్యే అవుతారా..? అనే మాట పడాల్సిందే. కాబట్టి అనూష గెలుపు ఇప్పుడు బొత్సకు పెద్ద సవాల్.

Also Read : తెలంగాణా బీజేపిలో ఏం జరుగుతోంది..?

అలాగే గరివిడి నుంచి ఓ వైపు వైసీపీ అభ్యర్థిగా బొత్స కోడలు బొత్స పూజిత పోటీ చేస్తుంటే.. మరోవైపు కూటమి అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు సీనియర్ నేతల కోడళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం గరివిడి నుంచి పోటీ పడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అటు కుమార్తె, ఇటు కోడలును గెలిపించుకునేందుకు బొత్స వ్యూహాలు రచిస్తున్నారు. ఇటు సంధ్య కోసం చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు స్వయంగా రంగంలోకి దిగారు. గరివిడిలో గడపగడపకు తిరుగుతున్నారు. దీంతో గరివిడి ఇప్పుడు విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మరోసారి బొత్స వర్సెస్ కిమిడి అన్నట్లుగా జెడ్పీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

విశాఖ మేయర్.. రంగంలోకి...

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విశాఖ మేయర్ పీఠం...

పోస్టల్ బ్యాలెట్లపై ఎస్‌ఈసీ...

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల...

తెలంగాణా బీజేపిలో ఏం...

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అగ్ర నాయకత్వం...

దూసుకొస్తున్న అర్నాబ్.. కోస్తాంధ్రకు...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్...

కడపలో స్టోరీ క్లోజ్..?...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, నగర పంచాయతీ చైర్‌పర్సన్...

విడదల రజినికి ఊహించని...

ఊహించని షాక్ తగిలింది. రెండు రోజుల...

పోల్స్