శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళ పక్షం.. 12-09-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..
మేషం
వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
—————————————
వృషభం
12-09-2026
విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంభందించి విలువైన సమాచారం అందుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. విందువినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
—————————————
మిధునం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
—————————————
కర్కాటకం
వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఇంటాబయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
—————————————
సింహం
పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాలలో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
—————————————
కన్య
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ యత్నాలు సానుకూలమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది.
—————————————
తుల
వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు.
—————————————
వృశ్చికం
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమౌతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
—————————————
ధనస్సు
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహనయోగం ఉన్నది. పాతబాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
—————————————
మకరం
కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సంతాన విద్యా, ఉద్యోగయత్నాలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————
కుంభం
ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో సమస్యలు అదిగమిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
—————————————
మీనం
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ పడినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
—————————————
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

