Thursday, October 29, 2026 04:49 PM
Thursday, October 29, 2026 04:49 PM

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో చంద్రబాబు సమీక్ష

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, కుండపోత వర్షాల్లోనూ సీఎం చంద్రబాబు తుఫాను సహాయక చర్యలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆర్నబ్‌ తుపాను కోస్తాంధ్ర ప్రాంతంలో భీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుఝామున తీరాన్ని తాకిన పెను తుపాను దెబ్బకు శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు తీవ్ర నష్టం జరిగింది. సూపర్ సైక్లోన్‌ ప్రభావంతో దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా సీఎం చంద్రబాబు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కార్యాలయం నుంచి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Also Read : జగన్ అడ్డాలో కూటమి పాగా.. పులివెందులలో వైసీపీకి షాక్!

అర్టీజీఎస్ సిబ్బంది, జిల్లాల కలెక్టర్లు, విద్యుత్, నీటిపారుదల, మున్సిపల్, పంచాయతీరాజ్‌, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న 32 వేల మందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.. తుపాను తీవ్రత తగ్గే వరకు ప్రజల ఇబ్బందులు తొలగించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకురావాలని సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన క్షేత్రస్థాయి సిబ్బంది.. రోడ్లపై కూలిన చెట్లను తొలగించి.. తెగిపోయిన విద్యుత్‌ లైన్లను పునరుద్దరిస్తున్నారు. తుఫాను ప్రభావంతో వీచిన ఈదురు గాలుల దెబ్బకు దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, లైన్లకు మరమ్మత్తులు చేసి గంటల వ్యవధిలోనే కరెంటు సరఫరా చేస్తున్నారు. పెను తుఫాను ప్రభావంతో కలిగే నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే 12 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 11 స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్‌ ఫోర్స్ టీమ్‌లతో పాటు నేవీ, కోస్ట్‌ గార్డ్‌ సిబ్బందిని రంగంలోకి దించింది.

Also Read : అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ..!

సుమారు 90 వేల మందిని సురక్షిత ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలకు కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను తీవ్రతతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి.. రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాలిక సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

కూటమిలో రెబల్స్‌పై చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1న జరగబోయే పట్టణ,...

బయట అర్నాబ్ బీభత్సం.....

రాష్ట్రం అర్నాబ్ తుఫాన్ ముప్పుతో వణికిపోతోంది....

కరువు ముప్పు.. కదిలిన...

ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో...

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

ఉత్తరప్రదేశ్ తమ కంచుకోట అనుకున్న బిజెపికి...

ఇరాన్‌పై దాడికి అమెరికా...

ప్రపంచవ్యాప్తంగా దాదాపు గత ఏడాది కాలంగా...

బ్యాలెట్ పద్ధతిలోనూ కాంగ్రెస్...

దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన...

పోల్స్