Wednesday, October 28, 2026 03:18 PM
Wednesday, October 28, 2026 03:18 PM

ఏపీలో ఆ ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా..?

అర్నబ్ తుఫాను భీభత్సం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యానాం-నరసాపురం మధ్య తుఫాను తీవ్ర రూపంలో తీరం దాటడంతో ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు పూర్తిగా అల్లకల్లోలమయ్యాయి. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో పాటు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయాలనే డిమాండ్లు క్షేత్రస్థాయి నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.

Also Read : జగన్ అడ్డాలో కూటమి పాగా.. పులివెందులలో వైసీపీకి షాక్!

రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఎన్నికలను పూర్తిగా వాయిదా వేసే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. ఇప్పటికే చట్టపరమైన నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారం షెడ్యూల్ ఖరారైనందున, మొత్తం ఎన్నికలను వాయిదా వేస్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా కేవలం తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్న కోస్తా జిల్లాల్లోని కొన్ని మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసే ప్రత్యామ్నాయాన్ని ఎస్‌ఈసీ పరిశీలిస్తోంది.

Also Read : తీరం దాటిన అర్నబ్ తుపాను.. కానీ ఇప్పుడే అసలు సినిమా..!

దీనిపై ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం తుది ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం అధికారికంగా వాయిదా వేయకపోయినా, ఈ సమయంలో పోలింగ్ నిర్వహించడం క్షేత్రస్థాయిలో కాస్త కష్టంగానే ఉంటుంది. కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాల్లో ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడలేదు. రోడ్లన్నీ చెట్లతో నిండిపోయి రవాణా వ్యవస్థ దెబ్బతింది. అన్నింటికంటే ముఖ్యంగా, ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ పాఠశాలలనే పోలింగ్ కేంద్రాలుగా మారుస్తారు. కానీ ప్రస్తుత విపత్తు వల్ల ఆ పాఠశాలలన్నీ బాధితులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. బాధితులను అక్కడి నుంచి ఖాళీ చేయించి, పోలింగ్ సామాగ్రిని తరలించి ఓటింగ్ నిర్వహించడం అధికారులకు పెను సవాల్‌గా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

అమిత్‌షాకు సీఎం చంద్రబాబు...

అర్నబ్ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్...

తీరం దాటిన అర్నబ్...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర...

ఆ ఆస్తుల్లో నీకు...

వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన...

జగన్ అడ్డాలో కూటమి...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్...

షర్మిలకి అండగా లోకేష్‌.....

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్...

పోల్స్