Wednesday, October 28, 2026 01:56 PM
Wednesday, October 28, 2026 01:56 PM

అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ..!

అర్నబ్ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. తుపాను వల్ల రాష్ట్రంలో జరిగిన తీవ్ర నష్టంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు బుధవారం ఒక లేఖ రాశారు. యానాం-నరసాపురం మధ్య తీరం దాటిన ఈ తుపాను కారణంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం అల్లకల్లోలంగా మారిందని, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్యుత్ రంగానికి భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి ఈ లేఖలో వివరించారు.

Also Read : షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

తుపాను వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన అంచనా వేయడానికి వెంటనే కేంద్ర బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలని సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, ప్రస్తుతం యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర బృందాల పర్యటన ద్వారా నష్ట తీవ్రతపై స్పష్టత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : విజయవాడలో రాధ గెలుపు అంత సులువేనా..?

రాష్ట్రంలో జరిగిన ఆస్తి, పంట, మౌలిక వసతుల నష్టంపై క్షేత్రస్థాయి అధికారుల ద్వారా ప్రస్తుతం నివేదికలు సేకరిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల నుంచి సమగ్ర నష్టం అంచనా నివేదిక అందిన వెంటనే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఏపీని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయాన్ని అందించాలని, రెస్క్యూ, పునరావాస చర్యలకు అవసరమైన పూర్తి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఈ లేఖ ద్వారా కోరారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

ఏపీలో ఆ ప్రాంతాల్లో...

అర్నబ్ తుఫాను భీభత్సం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే...

తీరం దాటిన అర్నబ్...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర...

ఆ ఆస్తుల్లో నీకు...

వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన...

జగన్ అడ్డాలో కూటమి...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్...

షర్మిలకి అండగా లోకేష్‌.....

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్...

పోల్స్