Wednesday, October 28, 2026 11:51 AM
Wednesday, October 28, 2026 11:51 AM

తీరం దాటిన అర్నబ్ తుపాను.. కానీ ఇప్పుడే అసలు సినిమా..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర తుపాను ఎట్టకేలకు పూర్తిగా భూమిపైకి చేరింది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని యానాంకు నైరుతి దిశలో, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి అత్యంత సమీపంలో ఈ తుపాను తీరాన్ని దాటినట్లు భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ధ్రువీకరించారు. సుదీర్ఘంగా సాగిన ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత అర్నబ్ కొంత బలహీనపడి, ప్రస్తుతం తీవ్ర తుపానుగా కొనసాగుతోంది.

Also Read : విజయవాడలో రాధ గెలుపు అంత సులువేనా..?

తుపాను తీరం దాటిన ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచాయి. ఈ ఉధృతికి వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Also Read : జగన్ అడ్డాలో కూటమి పాగా.. పులివెందులలో వైసీపీకి షాక్!

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. తుపాను పూర్తిగా భూమిపైకి వచ్చినప్పటికీ రానున్న ఆరు నుంచి ఏడు గంటల సమయం అత్యంత కీలకం అని అధికారులు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రజలెవ్వరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆ ఆస్తుల్లో నీకు...

వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన...

జగన్ అడ్డాలో కూటమి...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్...

షర్మిలకి అండగా లోకేష్‌.....

దివంగత నేత, మాజీ సీఎం వైఎస్...

జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం...

ఒంగోలు పార్లమెంట్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఒంగోలు...

అంతా అయిపోయింది అన్న.....

చేతులు కాలిన తర్వాత.. ఆకులు పట్టుకున్నట్లుగా...

పోల్స్