Thursday, October 29, 2026 11:20 AM
Thursday, October 29, 2026 11:20 AM

బ్యాలెట్ పద్ధతిలోనూ కాంగ్రెస్ కు కష్టాలు..!

దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన శాసనమండలి ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్‌లతో పాటు కాంగ్రెస్ స్వయంగా అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగగా, కనీసం ఒక్క సీటులో కూడా కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read :రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టైంలో మొబైల్ చార్జింగ్ బంద్..!

ఎల్లప్పుడూ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ.. ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగాయనే విషయాన్ని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “నాలుగు పెద్ద రాష్ట్రాల్లో 28 స్థానాలకు బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి?” అంటూ ఓ నవ్వుతున్న ఎమోజీని జత చేస్తూ ఎక్స్ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉందంటూ బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి.

Also Read : ఇంకా ఎంత కాలం ఇలా ఏడుపు..?

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. వారణాసితో సహా పలు కీలక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరాశజనక ప్రదర్శన కనబరిచింది. కర్ణాటకలో అధికారంలో ఉండి కూడా ఒక్క సీటు సాధించలేకపోవడం కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద షాక్‌గా మారింది. అక్కడ బీజేపీ-జేడీఎస్ కూటమి ఘన విజయం సాధించి విజయభేరి మోగించింది. ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టగా, ఎన్డీయే కూటముల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇరాన్‌పై దాడికి అమెరికా...

ప్రపంచవ్యాప్తంగా దాదాపు గత ఏడాది కాలంగా...

అర్నబ్ వెనుకాలే ఏపీకి...

తీర ప్రాంత ప్రజలు తీవ్ర తుఫాన్...

ఇంకా ఎంత కాలం...

మళ్లీ మళ్లీ అదే ఏడుపు.. ఇది...

బాబోయ్.. అక్టోబర్ నెల...

అక్టోబర్ నెల అంటే చాలు.. ఆంధ్రప్రదేశ్...

రూ. 3 వేల...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల...

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

పోల్స్