Wednesday, October 28, 2026 06:10 PM
Wednesday, October 28, 2026 06:10 PM

రూ. 3 వేల కోసం కక్కుర్తి.. టికెట్ వదులుకున్న వైసీపీ అభ్యర్థి..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బాపట్ల జిల్లా పరిధిలో ఒక విచిత్రమైన పొలిటికల్ కామెడీ చోటుచేసుకుంది. కేవలం మూడు వేల రూపాయల డిపాజిట్ సొమ్ము వెనక్కి వస్తుందనే చిన్న ఆశతో ఒక వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏకంగా తన జెడ్పీటీసీ రేసు నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా షేక్ మౌలాలి నామినేషన్ వేశారు. ఆయన భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఒక్కో సెట్‌కు రూ. 3 వేల చొప్పున మొత్తం రూ. 6 వేల డిపాజిట్ సొమ్మును అధికారులకు చెల్లించారు.

Also Read : అమిత్‌షాకు సీఎం చంద్రబాబు లేఖ..!

అయితే స్క్రూటినీ ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారులు ఆయన వేసిన రెండు సెట్ల నామినేషన్లను సక్రమంగానే ఉన్నాయని ఆమోదించారు. రెండు నామినేషన్లు ఓకే అవ్వడంతో.. అనవసరంగా రెండు సెట్లు ఎందుకని, ఒక సెట్ విత్‌డ్రా చేసుకుంటే దానికి కట్టిన రూ. 3 వేల డిపాజిట్ డబ్బులు వెనక్కి వస్తాయని మౌలాలి భావించారు. ఈ క్రమంలోనే ఒక సెట్ నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సంతకం చేసి అధికారులకు అధికారికంగా లెటర్ ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది.

Also Read : తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో చంద్రబాబు సమీక్ష

ఎన్నికల నిబంధనల ప్రకారం ఒకే అభ్యర్థి రెండు సెట్లు వేసి, అందులో ఒక దాన్ని విత్‌డ్రా చేసుకుంటే.. రెండు సెట్ల నామినేషన్లు కూడా ఆటోమేటిక్‌గా ఇన్‌వ్యాలిడ్ అయిపోతాయి. ఈ రూల్ తెలియని షేక్ మౌలాలి ఒక సెట్ ఉపసంహరించుకోగానే.. ఆయన వేసిన రెండు నామినేషన్లు రద్దయిపోయాయి. దీంతో ఆయన జెడ్పీటీసీ పోటీకి పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది. ఇదే సమయంలో అక్కడ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి రెహ్మాన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మూడు వేల రూపాయల కోసం ఆశపడి జెడ్పీటీసీగా పోటీ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోవడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

ఏపీలో ఆ ప్రాంతాల్లో...

అర్నబ్ తుఫాను భీభత్సం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే...

అమిత్‌షాకు సీఎం చంద్రబాబు...

అర్నబ్ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్...

తీరం దాటిన అర్నబ్...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర...

ఆ ఆస్తుల్లో నీకు...

వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన...

జగన్ అడ్డాలో కూటమి...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్...

పోల్స్