Wednesday, October 28, 2026 06:25 PM
Wednesday, October 28, 2026 06:25 PM

రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టైంలో మొబైల్ చార్జింగ్ బంద్..!

ట్రైన్లలో రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి భారత రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. రైళ్లలో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు మొబైల్, లాప్‌టాప్ చార్జింగ్ పాయింట్లను పూర్తిగా నిలిపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లను ఆదేశించింది. ఇటీవల ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోవడంతో కోచ్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఈ ప్రమాదం నేపథ్యంలో భద్రతా చర్యలలో భాగంగా రైల్వే బోర్డు పాత నిబంధనలను మరోసారి కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

Also Read : విజయవాడలో రాధ గెలుపు అంత సులువేనా..?

ఈ ఆరు గంటల సమయ వ్యవధిలో రైల్వే సిబ్బంది ఖచ్చితంగా చార్జింగ్ పాయింట్లను స్విచ్ ఆఫ్ చేయాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని బోర్డు హెచ్చరించింది. నిబంధనలు సరిగ్గా అమలువుతున్నాయో లేదో తనిఖీ చేయడానికి అధికారులు అకస్మాత్తుగా రైళ్లలో తనిఖీలు చేపట్టనున్నారు. నిజానికి ఈ నిబంధన కొత్తదేమీ కాదు, 2014 2021 లలోనే దీనిపై ఆదేశాలు ఉన్నప్పటికీ, తాజా ప్రమాదం తర్వాత రైల్వే శాఖ దీనిపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

Also Read : తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో చంద్రబాబు సమీక్ష

రైళ్లలో రాత్రి పూట చార్జింగ్ పెట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్లు జరిగి అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ప్రయాణికులు తమ రాత్రి ప్రయాణాన్ని ప్రారంభించే ముందే మొబైల్స్, పవర్ బ్యాంకులు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను చార్జ్ చేసి పెట్టుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రాత్రి 11 గంటల తర్వాత చార్జింగ్ సదుపాయం ఏ కోచ్‌లోనూ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రూ. 3 వేల...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల...

తుఫాన్‌ వేగంతో సహాయక...

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో...

ఏపీలో ఆ ప్రాంతాల్లో...

అర్నబ్ తుఫాను భీభత్సం ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే...

అమిత్‌షాకు సీఎం చంద్రబాబు...

అర్నబ్ అతి తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్...

తీరం దాటిన అర్నబ్...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ అతి తీవ్ర...

ఆ ఆస్తుల్లో నీకు...

వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన...

పోల్స్