Friday, September 11, 2026 05:07 PM
Friday, September 11, 2026 05:07 PM

ఎన్టీఆర్ భరోసాకు సెలవుల గండం..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన సామాజిక భద్రతా పింఛన్లు.. ఎన్టీఆర్ భరోసా దరఖాస్తుల ప్రక్రియకు క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఒకవైపు సచివాలయాల్లో సర్వర్లు మొరాయిస్తుండగా, మరోవైపు క్యాలెండర్ సెలవులు లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఇచ్చినప్పటికీ, అందుబాటులో ఉన్న పనిదినాలు వేళ్లమీద లెక్కపెట్టే స్థాయికి పడిపోవడంతో అర్హులైన పేదల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read : మంగళగిరిలో సంచలనం.. కేవలం 60 సెకన్లలోనే 60 రకాల టెస్టులు..!

కూటమి ప్రభుత్వం నూతన పింఛన్ల స్వీకరణకు పచ్చజెండా ఊపడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తెల్లవారుజాము నుంచే గ్రామ, వార్డు సచివాలయాలకు పోటెత్తుతున్నారు. అయితే, దరఖాస్తుల సమర్పణకు నెలాఖరు వరకు సమయం ఇవ్వకుండా ఈ నెల 16వ తేదీనే ఆఖరి గడువుగా నిర్ణయించారు. దీనికితోడు ఈ నెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు అధికారిక సెలవులు రానున్నాయి. దీంతో దరఖాస్తుదారులకు వాస్తవంగా మిగిలిన పనిదినాలు కేవలం రెండు రోజులే కావడం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది.

గత నాలుగు రోజులుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ నెల 7న దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన చాలామందికి సాంకేతిక లోపాల వల్ల రిజిస్ట్రేషన్ కాకపోవడంతో మరుసటి రోజు కూడా క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది. అవసరమైన ధ్రువపత్రాల కోసం జిరాక్స్, మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసి తెచ్చుకున్నా, తీరా సచివాలయాల్లో పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో లబ్ధిదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆఖరి రోజుల్లో రద్దీ మరింత పెరిగితే నెట్‌వర్క్ పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉందని సిబ్బంది చెబుతున్నారు.

Also Read : కొబ్బరి నీళ్లలో సైనైడ్ కలిపాను.. సాధిక్ ఖాన్ సంచలన నిజాలు..!

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమైతే మూడు రోజుల్లో మరో 2 లక్షల వరకు దరఖాస్తులు రావచ్చని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం క్షేత్రస్థాయి విచారణ, అర్హుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ ప్రక్రియ నిలిచిపోతుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్ రాకముందే ప్రక్రియ పూర్తి చేసి పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. సర్వర్ల సమస్యలు, వరుస సెలవులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణమే గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చిత్ర విచిత్రంగా బీజీపీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా...

మహేష్ బాబు, రాజమౌళికి...

హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా...

కొబ్బరి నీళ్లలో సైనైడ్...

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన...

రేవంత్ ప్లాన్.. బీఆర్ఎస్...

అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి...

మంగళగిరిలో సంచలనం.. కేవలం...

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త...

బొల్లారం ఆర్మీ ఆయుధాలు...

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ పరిధిలో గల...

పోల్స్