Friday, September 11, 2026 04:02 PM
Friday, September 11, 2026 04:02 PM

రేవంత్ ప్లాన్.. బీఆర్ఎస్ షాక్..!

అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెట్టడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంపై పూర్తిస్థాయి పై చెయ్యి సాధించింది. సమావేశాల ప్రారంభం నుంచి అమలు చేస్తోన్న వ్యూహాలతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇబ్బందులు పడుతోంది. అందుకు సీఎం రేవంత్ స్ట్రాటజీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కార్యాచరణ కలిసి వచ్చాయనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ సభ్యుల ప్రతి కదలికను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో అధికార పార్టీ నేతలు విజయం సాధించారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి సభలో ఇతర పార్టీల మద్దతును కూడగట్టిన కాంగ్రెస్.. బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పడేసింది.

Also Read : మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన..!

గతంలో కంటే భిన్నంగా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రుల మధ్య ఫ్లోర్ కో ఆర్డినేషన్ మెరుగ్గా కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ను ఎటాక్ చేసే విషయంలో సీఎం రేవంత్ స్ట్రాటజీ మేరకు మంత్రులు తమ ప్లాను అమలుచేస్తున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ చురుకుగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్.. బీఆర్ఎస్ సభ్యుల ప్రతి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యూహాలు మారుస్తున్నారు. దీంతో ఆయన సభకు హాజరు కాకపోయినా అసెంబ్లీలోని తన చాంబర్‌లోనే ఉంటూ మంత్రులకు సూచనలు ఇస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా కేసీఆర్ ఫాంహౌజ్ వద్ద డప్పు చప్పుళ్ల కార్యక్రమంతో ముగింపు పలకాలని భావించారు. కానీ బీఆర్ఎస్ చేపట్టిన శుద్ధీకరణ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చింది. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా వ్యవహరించి సక్సెస్ అయింది.

సభాకార్యక్రమాలు మొదలవడంతోనే కేసీఆర్ చావు కోరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పొడియం చుట్టుముట్టారు. అయితే, అధికార పక్షం ఊహించని విధంగా ‘శుద్ధీకరణ’ అంశాన్ని తెరమీదకి తెచ్చింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు షాక్‌కు గురైనట్టు తెలిసింది. ఉన్నపళంగా దానిపై చర్చకు పెట్టడంతో ఎలా మాట్లాడాలో తెలియక సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఒకవేళ మాట్లాడితే సొంత పార్టీ కార్యకర్తలు చేసిన శుద్ధీకరణ కార్యక్రమాన్ని తప్పుపట్టాల్సి వస్తుంది. అలా కాకుండా తమ పార్టీ కార్యకర్తలు చేసిన పనిని సమర్ధిస్తే దళిత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని అంచనా వేశారు. అందుకని సభా కార్యక్రమాలను అడ్డుకోవడమే మేలని స్పీకర్ పొడియం చుట్టుముట్టినట్టు తెలిసింది. దీంతో చేసేదేం లేక ఈ సెషన్స్ ముగిసే వరకు బీఆర్ఎస్ సభ్యులు అందరినీ స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ పరిణామాన్ని గులాబీ ఎమ్మెల్యేలు అస్సలు అంచనా వేయలేదు. కేవలం ఒక్కరోజు మాత్రమే సభ నుంచి బయటకు పంపుతారని భావించారు. కానీ సెషన్ మొత్తాన్ని సస్పెండ్ చేయడంతో షాక్ అయ్యారు.

Also Read : బొల్లారం ఆర్మీ ఆయుధాలు దొరికేసాయి.. ఎక్కడంటే..!

ఈ అసెంబ్లీ సెషన్స్‌లో వరుసగా మూడు రోజుల పాటు బీఆర్ఎస్‌ను శాసనసభలో ఒంటరిగా చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను బీజేపీ, మజ్లిస్, సీపీఐ పార్టీల సభ్యులు సైతం మద్దతు పలికారు. సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరును పార్టీలన్నీ వ్యతిరేకించాయి. వారిపై చర్యలు తీసుకోవాలని భావించిన అధికార పార్టీ నిర్ణయాన్ని ఇతర పార్టీల సభ్యులు సైతం స్వాగతించారు. అదేవిధంగా ‘శుద్ధీకరణ’ అంశంలోనూ కాంగ్రెస్ కు సపోర్టుగా నిలిచారు. దళితులను అవమానపరిచేలా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సభలో, బయట బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు లోక భవన్‌కు వెళ్లారు. ఆ టీమ్‌లో ఎవరు ఉండాలో స్వయంగా సీఎం సూచించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా గవర్నర్ ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపైనా సీఎం రేవంత్ సభ్యులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మహేష్ బాబు, రాజమౌళికి...

హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా...

కొబ్బరి నీళ్లలో సైనైడ్...

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన...

మంగళగిరిలో సంచలనం.. కేవలం...

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త...

బొల్లారం ఆర్మీ ఆయుధాలు...

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ పరిధిలో గల...

మెగా డీఎస్సీపై మంత్రి...

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ...

చిన్న శ్రీను ఎఫెక్ట్.....

ఉత్తరాంధ్ర వైసీపీలో కీలక నేతగా ఉన్న...

పోల్స్