Wednesday, September 9, 2026 04:09 PM
Wednesday, September 9, 2026 04:09 PM

ఈరోజు రాశి ఫలితాలు (09-09-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళ పక్షం.. 09-09-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం
09-09-2026

వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం పొందుతారు.చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి.
—————————————

వృషభం
09-09-2026

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలు మానసికంగా చికాకుగా కలిగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టించినా ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.
—————————————

మిధునం
09-09-2026

వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు పడకూడదు.
—————————————

కర్కాటకం
09-09-2026

స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
—————————————

సింహం
09-09-2026

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. భాగస్వామితో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.
—————————————

కన్య
09-09-2026

ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విద్యార్థుల శ్రమ ఫలించదు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు తప్పవు.
—————————————

తుల
09-09-2026

ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.
—————————————

వృశ్చికం
09-09-2026

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
—————————————

ధనస్సు
09-09-2026

సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
—————————————

మకరం
09-09-2026

విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు.
—————————————

కుంభం
09-09-2026

వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
—————————————

మీనం
09-09-2026

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

స్థానిక ఎన్నికలు.. ‘మినీ...

స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ రాజకీయాల్లో...

ఏపీ పర్యాటక రంగానికి...

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి...

వైసీపీ హయాం మద్యం...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో...

పాదయాత్ర 2.O ముహూర్తం...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సరికొత్త...

20 కోట్లు ఆఫర్.....

మాజీ మంత్రి, జగన్‌ బాబాయి YS...

కేసీఆర్ ‘ప్రతిపక్ష’ కుర్చీకి...

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సభ...

పోల్స్