శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళ పక్షం.. 10-09-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..
మేషం
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. బంధువర్గం నుండి ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.
—————————————
వృషభం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తప్పవు. ఆస్తి వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. పనులలో జాప్యం కలుగుతుంది. —————————————
మిధునం
వ్యాపార విషయంలో ఆకస్మిక నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన పనులు శ్రమతో గాని పూర్తి కావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
—————————————
కర్కాటకం
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
—————————————
సింహం
వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————
కన్య
విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువర్గంతో వివాదాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
—————————————
తుల
వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
—————————————
వృశ్చికం
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.
—————————————
ధనస్సు
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయటం మంచిది. దైవచింతన పెరుగుతుంది.
—————————————
మకరం
చిన్ననాటి మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.
—————————————
కుంభం
చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి.
—————————————
మీనం
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినప్పటికి నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
—————————————
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

