Saturday, October 17, 2026 07:44 PM
Saturday, October 17, 2026 07:44 PM

గుండెపోటు ముప్పును 30% తగ్గించే కొలెస్ట్రాల్ టాబ్లెట్..!

భారత్ లో ప్రస్తుతం గుండె జబ్బులు అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సవాలుగా మారాయి. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, అధిక రక్తపోటు, మధుమేహం మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల యువకులతో పాటు వృద్ధులలో కూడా హార్ట్ ఎటాక్ ముప్పు విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక ‘ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ ప్రచురించిన ఒక తాజా పరిశోధన గుండె జబ్బుల నివారణపై ఒక కీలకమైన ఆశను రేకెత్తించింది.

Also Read : బొత్స.. మైండ్ గేమ్ పాలిట్రిక్స్..!

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడే ఒక పాపులర్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ వృద్ధులలో గుండెపోటు ముప్పును ఏకంగా 30 శాతం వరకు తగ్గిస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన కోసం ఆస్ట్రేలియాకు చెందిన దాదాపు 9,971 మందిని ఎంపిక చేసి ఒక సుదీర్ఘ క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వృద్ధులకు ప్రతిరోజూ ‘అటోర్వాస్టాటిన్ 40 ఎంజీ’ అనే కొలెస్ట్రాల్ నియంత్రణ ఔషధాన్ని లేదా ప్లాసిబోను ఇచ్చి పరిశీలించారు. దాదాపు 5.9 సంవత్సరాల పాటు సాగిన ఈ సుదీర్ఘ అధ్యయనంలో.. అటోర్వాస్టాటిన్ క్రమం తప్పకుండా వాడిన వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఇతరులకంటే 30 శాతం తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also Read : చరిత్ర సృష్టించబోతున్న ఉత్తరాంధ్ర.. అనకాపల్లికి గోదావరి జలాలు..!

ఈ డ్రగ్ కేవలం కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని అడ్డుకుంటూ, గుండె నాళాల్లో వచ్చే వాపు లేదా ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించి కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తేలింది. ఈ పరిశోధన ఫలితాలు ముఖ్యంగా 65 సంవత్సరాలు పైబడిన వారికి, అధిక రక్తపోటు మరియు డయాబెటిస్ వంటి బహుళ గుండె జబ్బుల రిస్క్ కారకాలు ఉన్న రోగులకు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి. అయితే, ఈ స్టాటిన్ ఔషధాల వల్ల కొందరిలో కండరాల నొప్పులు మరియు లివర్ ఎంజైమ్‌లలో మార్పులు వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్