Sunday, October 18, 2026 05:35 AM
Sunday, October 18, 2026 05:35 AM

చరిత్ర సృష్టించబోతున్న ఉత్తరాంధ్ర.. అనకాపల్లికి గోదావరి జలాలు..!

ఉత్తరాంధ్ర రైతాంగ దశాబ్దాల కల నెరవేరబోతోంది. కరవు కోరల్లో చిక్కుకుని, సాగు-తాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అనకాపల్లి జిల్లా భూములను తడిపేందుకు గోదావరి జలాలు తరలివస్తున్నాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని తాండవ రిజర్వాయర్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని గోదావరి జలాలకు ‘జలహారతి’ ఇవ్వనున్నారు.

Also Read : కేఏ పాల్ ని కదిపి బొత్స పరువు పోగొట్టుకున్నాడా?

గోదావరి జలాలు వస్తున్నాయనే వార్తతో అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అన్నదాతల్లో ఆనందోత్సాహాలు అంబరాన్ని తాకాయి. రేపటి చారిత్రాత్మక కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి ఒక్క రైతును భాగస్వామ్యం చేసేందుకు రైతు సంఘాల నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పల్లె పల్లెనా ఇంటింటికీ తిరుగుతూ, సాంప్రదాయబద్ధంగా ఆహ్వాన పత్రికలు అందిస్తూ అన్నదాతలను ఈ మహోత్సవానికి ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో దీపావళి కంటే ముందే పండుగ వాతావరణం నెలకొంది.

Also Read : టాలీవుడ్‌లో మైండ్ బ్లోయింగ్ కాంబో..!

గోదావరి-పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం ఎడమ కారిడార్ ద్వారా అనకాపల్లి, విశాఖ జిల్లాల పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా.. తాండవ రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాలకు ఈ నీరు ప్రాణాధారంగా మారబోతోంది. గతంలో నీరు లేక ఎండిపోయిన పంట పొలాలకు ఈ జలాలు కొత్త జీవాన్ని ఇవ్వనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగబోయే ఈ జలహారతి కార్యక్రమం కేవలం ఒక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు.. ఇది ఉత్తరాంధ్ర ఆర్థిక, వ్యవసాయ ప్రగతికి సరికొత్త బాటలు వేసే సువర్ణ అధ్యాయం.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్