Thursday, August 27, 2026 11:00 AM
Thursday, August 27, 2026 11:00 AM

దిల్ రాజుకు ఇతర భాషలు కలిసి రావడం లేదా..?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు జడ్జిమెంట్‌కు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కథలను ఎంచుకోవడంలో, ప్రేక్షకుడి నాడిని పట్టుకోవడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. కానీ, గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలను దాటి ఇతర భాషా మార్కెట్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన వేస్తున్న అడుగులు వరుసగా బెడిసికొడుతున్నాయి. మూడేళ్ళ క్రితం కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్‌తో తీసిన వరిసు.. సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడం, తాజాగా భారీ ఆశలతో బిజినెస్ చేసిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్ చిత్రం టాక్సిక్ కు తీవ్ర నెగటివ్ ప్రతికూల టాక్ రావడం ఆయనకు భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చింది.

Also Read : వైసీపీలో తారాస్థాయికి ఆధిపత్య పోరు..!

పక్క భాషల్లో దిల్ రాజుకు ఎదురైన ఇలాంటి కొన్ని చేదు అనుభవాలు, ప్లాప్ సినిమాలు ఓ లుక్ ఇస్తే.. తమిళంలో విజయ్.. వారిసు.. భారీ అంచనాల మధ్య విడుదలై షాక్ ఇచ్చింది. తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్ తో రాగా.. విజయ్ లాంటి భారీ మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో 90ల నాటి పాతచింతకాయ పచ్చడి లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ కథను ఎంచుకోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరిగినప్పటికీ, తమిళనాడు మార్కెట్లో ఎన్నో థియేటర్ల యజమానులకు, పంపిణీదారులకు ఈ చిత్రం ఆశించిన స్థాయి లాభాలను తీసుకురాలేకపోయింది.

Also Read : ‘టాక్సిక్’ మూవీ రివ్యూ: యష్‌కి కేజీఎఫ్ హ్యాంగోవర్ తప్పలేదా?

ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఖర్చు, ఆశించిన పొలిటికల్ మైలేజ్ పరంగా దిల్ రాజుకు ఇది కోలీవుడ్‌లో ఒక నిరాశాజనకమైన అడుగుగానే మిగిలిపోయింది. హిందీ మార్కెట్ పై కన్నేసిన దిల్ రాజు.. తెలుగులో సూపర్ హిట్ అయిన నాని జెర్సీ, విశ్వక్ సేన్ ‘హిట్: ది ఫస్ట్ కేస్ ‘ చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్‌తో భారీ బడ్జెట్‌తో నిర్మించిన జెర్సీ.. హిందీ రీమేక్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అలాగే రాజ్‌కుమార్ రావుతో తీసిన.. హిట్ సినిమాకు కూడా నార్త్ ఆడియన్స్ థియేటర్లకు రాలేదు.

Also Read : ఏపీలో వాళ్లకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక నిర్ణయం..!

సౌత్ సినిమాలను నేరుగా హిందీలోకి డబ్ చేసి చూస్తున్న ఈ రోజుల్లో.. పాత కథలను మళ్లీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హిందీలో రీమేక్ చేయాలనే దిల్ రాజు జడ్జిమెంట్‌ను బాలీవుడ్ ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు, దీనివల్ల ఆయనకు భారీగా నష్టాలు వచ్చాయి. కెజిఎఫ్ సినిమా తర్వాత గ్లోబల్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న కన్నడ నటుడు యశ్ నటించిన టాక్సిక్..’ సినిమాపై ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజ్ ను చూసి దిల్ రాజు తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను దాదాపు రూ. 120 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నారు.

అయితే, నిర్మాణ దశ నుంచే తీవ్ర జాప్యం, గందరగోళ షెడ్యూల్స్ ఎదుర్కొన్న ఈ చిత్రం విడుదలైన తర్వాత కథలో బలం లేకపోవడం వల్ల తీవ్ర నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఫలితంగా థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా దిల్ రాజు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రికవరీ చేయలేకపోయిందని, ఇది ఆయన కెరీర్‌లోనే పంపిణీ పరంగా ఒక అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిందని ట్రేడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తెలుగుదేశం పార్టీకి కేంద్రం...

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌లో...

ఆ ప్రశ్నలకు సాయిరెడ్డి...

రాజకీయాల్లో మిత్రులు శత్రువులుగా మారడం కొత్తేమీ...

వైసీపీలో తారాస్థాయికి ఆధిపత్య...

ఓ వైపు అధికారం కోల్పోయిన నిర్వేదం.....

వైసీపీ ప్రేమలో సిఐ...

పులివెందులలో వైకాపా కబ్జాదారులకు కొందరు పోలీస్...

ఏపీలో వాళ్లకు గుడ్...

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద...

జనసేనలోకి కొండా సుస్మిత?...

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి...

పోల్స్