Sunday, October 18, 2026 03:34 AM
Sunday, October 18, 2026 03:34 AM

అవును సజ్జల కొట్టాడు.. కోటంరెడ్డి సంచలనం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల వైసీపీ మాజీ సీనియర్ నేత వి. విజయసాయి రెడ్డి అధినేత వైఎస్ జగన్‌కు రాసిన బహిరంగ లేఖలో, 2022 మంగళగిరి ప్లీనరీ వేదికపై తనపై సజ్జల రామకృష్ణారెడ్డి భౌతికంగా దాడి చేశారని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మరియు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : ఏపీ సర్కార్ సంచలనం.. అంబులెన్స్ సేవల్లో క్వాంటమ్ విప్లవం..!

విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు ముమ్మాటికీ నిజమేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధృవీకరించారు. గతంలో మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లీనరీ సమయంలో వేదికపై ఎవరితో మాట్లాడించాలనే ప్రాధాన్యత విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిల మధ్య తీవ్ర వివాదం చెలరేగిందని ఆయన గుర్తు చేశారు. ఆ వివాదంలో మాటామాటా పెరిగి విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి భౌతికంగా కొట్టడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని ఆయన స్పష్టం చేశారు.

Also Read : పంచె కట్టులో చంద్రన్న.. ప్రజల నీరాజనం..!

ఆ సమయంలో వైఎస్ జగన్ అంతా తెలిసి కూడా ఒక మూగ ప్రేక్షుకుడిలా ఉండిపోయారన్న విజయసాయి రెడ్డి ఇదే క్రమంలో వైసీపీ అనుసరిస్తున్న ప్రస్తుత రాజకీయ శైలిపై కోటంరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చులు పెడుతూ వైసీపీ అత్యంత వికృత రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి జరిగినా లేదా ఇతర పార్టీల హయాంలో జరిగిన ప్రాజెక్టులనైనా సరే తమ ఖాతాలో వేసుకునే ‘క్రెడిట్ చోరీ’ ధోరణి వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. వైసీపీ తాపత్రయం చూస్తుంటే.. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టును కట్టింది జగనేనని, ఆఖరికి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డే అని ప్రచారం చేసుకునేలా ఉన్నారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్