Sunday, October 18, 2026 02:41 AM
Sunday, October 18, 2026 02:41 AM

టాలీవుడ్‌లో మైండ్ బ్లోయింగ్ కాంబో..!

చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు ఒక సంచలన వార్త జోరుగా హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటి సిఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ కాంబినేషన్‌లో ఒక భారీ పొలిటికల్ మూవీ రాబోతోందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన రానుందని సమాచారం.

Also Read : పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు వ్యూహం ఇదేనా..?

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల విధ్వంసం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. పవన్ కళ్యాణ్‌తో గనుక పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా తీస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమంటూ అభిమానులు ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెంచేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మార్కు ఇంటెన్స్ పవర్ ప్యాక్డ్ యాక్టింగ్, సందీప్ రెడ్డి వంగా మార్కు బోల్డ్ అండ్ ఎమోషనల్ టేకింగ్ తోడైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త పాన్ ఇండియా రికార్డ్ క్రియేట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read : పంచె కట్టులో చంద్రన్న.. ప్రజల నీరాజనం..!

అయితే, ఈ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా అత్యంత బిజీగా ఉండటంతో గత రెండేళ్లుగా ఆయన సినిమాలు ఆలస్యం అవుతూ వచ్చాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగా కూడా రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిజంగానే సెప్టెంబర్ 2న ఏదైనా బిగ్ సర్ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్