Sunday, October 18, 2026 05:35 AM
Sunday, October 18, 2026 05:35 AM

పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు వ్యూహం ఇదేనా..?

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన పిఠాపురంలో ‘జనసేన యువజన విభాగం’ అధికారిక ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. ఈ కీలక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఆన్‌లైన్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి దిశా నిర్దేశం చేయనుండగా, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Also Read : వైసీపీ నేతలను జగన్ కావాలనే రెచ్చగొడుతున్నారా..?

గతంలో తెలుగుదేశం పార్టీకి ‘తెలుగుయువత’ అనుబంధ విభాగం ఏ విధంగా బలమైన క్యాడర్‌ను, భవిష్యత్తు నాయకత్వాన్ని అందించిందో.. ఇప్పుడు జనసేన పార్టీ సైతం అదే బాటలో పయనిస్తోంది. కేవలం ఒక వేడుకలా కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా యువతను ఒకే తాటిపైకి తెచ్చి పార్టీకి పటిష్టమైన అనుబంధ విభాగాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ అడుగు పడుతోంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత, క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులను మరింత బలోపేతం చేయడంలో ఈ యువజన విభాగం అత్యంత కీలకంగా మారనుంది.

Also Read : ఐటీ సారధే కాదు.. రైతు బాంధవుడు కూడా.. చంద్రబాబులో రెండో కోణం

దీని వెనుక పవన్ కళ్యాణ్ సుదూర రాజకీయ వ్యూహం మరియు స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కాకుండా, దీర్ఘకాలికంగా రాజకీయాల్లో నిలదొక్కుకునేలా సెకండ్ లైన్ లీడర్‌షిప్‌ను అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం.. తయారు చేయడం పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశం. యువతలో ఉన్న ఆలోచనలను, వారి ఆవేశాన్ని సరైన మార్గంలో పెట్టి, ప్రజా సేవకు ఉపయోగపడేలా సంస్కరించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేయనుంది. రాబోయే రోజుల్లో జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ యంగ్‌ గ్రేడ్‌ లీడర్సే ప్రధాన సైన్యంగా మారబోతున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్