Sunday, October 18, 2026 06:16 AM
Sunday, October 18, 2026 06:16 AM

విశాఖకు మణిహారం.. ప్రముఖ ఆస్పత్రి వచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవబోతోంది. ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘ఏఐజీ ఆసుపత్రి’ నూతన బ్రాంచ్‌ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు అధికారికంగా శంకుస్థాపన చేయనున్నారు. కేవలం చికిత్సలకే పరిమితం కాకుండా, ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ స్థాయి హెల్త్ కేర్, అకడమిక్ అండ్ రీసెర్చ్ హబ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దనున్నారు.

Also Read : “గురుకులాలకు తాళాలు”.. ప్రచారంలో వాస్తవమెంత..?

ఈ మెగా హెల్త్‌కేర్ ప్రాజెక్టును రెండు దశల్లో భారీ పడకల సామర్థ్యంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంR చేశారు. మొదటి దశలో భాగంగా 650 పడకలను అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తీసుకురానుండగా, రెండవ దశలో మరో 350 పడకలను జోడించి మొత్తం 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా దీనిని విస్తరిస్తారు. గ్లోబల్ స్టాండర్డ్స్ మెడికల్ టెక్నాలజీతో, నగర ప్రజలతో పాటు పొరుగు జిల్లాల వారికి కూడా కార్పొరేట్ వైద్యం ఇక్కడ సులభంగా అందనుంది.

Also Read : ఐటీ సారధే కాదు.. రైతు బాంధవుడు కూడా.. చంద్రబాబులో రెండో కోణం

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో వస్తున్న ఈ అంతర్జాతీయ ఆసుపత్రి కోసం దాదాపు రూ.2,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 9,000 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ రాకతో విశాఖ నగరం త్వరలోనే గ్లోబల్ మెడికల్ డెస్టినేషన్‌గా మారబోతోందని పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తిరువూరు కూటమిలో అసమ్మతి.....

కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి...

Garividi Lakshmi Review:...

ఉత్తరాంధ్ర జానపద కళాసంప్రదాయంలో తనకంటూ ప్రత్యేక...

రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం...

హోం మంత్రి పదవి...

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి...

ఓటమి భయంతోనే దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని...

సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.....

మాజీ మంత్రి, జగన్ సొంత బాబాయి...

పోల్స్