Saturday, August 29, 2026 03:15 PM
Saturday, August 29, 2026 03:15 PM

“గురుకులాలకు తాళాలు”.. ప్రచారంలో వాస్తవమెంత..?

కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు సాగిస్తున్న ‘గురుకులాల మూసివేత’ ప్రచారానికి కోట, తాడికొండల్లో కనిపిస్తున్న వాస్తవాలే గట్టి సమాధానం. గురుకులాలకు తాళాలు వేసి విద్యార్థులను రోడ్డున పడేయడం కాదు.. అదే గురుకులాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్ది పేద విద్యార్థులకు ఐఐటీ – జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవైపు ‘మూసివేశారు’ అంటూ రాజకీయ రాద్ధాంతం.. మరోవైపు రూ.20 లక్షలతో కోటలో ఆధునిక తరగతి గదులు, తాడికొండలో రూ.3.90 కోట్ల కోచింగ్ ప్రణాళిక, ఎకెఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ స్టడీ సెంటర్ సహకారంతో పేద విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ.. ఇవీ వాస్తవాలు.

Also Read : SC, STలకు జగన్‌ వెన్నుపోటు..!

గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మూసివేస్తోందంటూ కొందరు చేస్తున్న ప్రచారం రాజకీయ దుమారం రేపుతోంది. అయితే వాస్తవ వరిస్థితులు పరిశీలిస్తే కోట, తాడికొండలో జరుగుతున్నది మూసివేత కాదని.. విద్యా విధానంలో మార్పు, ఉన్నతీకరణ అని స్పష్టమవుతోంది. ఎస్సీ విద్యార్ధులకు సాధారణ ఇంటర్ విద్యతో పాటు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నంలోని మేఘాద్రిగడ్డ, గుంటూరు జిల్లా తాడికొండ, నెల్లూరు జిల్లా కోటలో మూడు సీఓఈలు ఏర్పాటు చేశారు. పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలన్నదే వీటి ప్రధాన ఉద్దేశం.

గురుకులాలను మూసివేశారంటూ ప్రచారం చేస్తున్న సమయంలోనే సీఓఈల్లో ఇంటర్ ఫస్టియర్ మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించారు. అర్హులైన విద్యార్థులు కేంద్రాలను సంప్రదించి ప్రవేశాలు పొందేలా అధికారులు అవకాశం కల్పించారు. ఇది విద్యార్థుల చదువును నిలిపివేయడం కాదని.. వారిని మరింత మెరుగైన విద్యా, పోటీ పరీక్షల శిక్షణ వ్యవస్థలోకి తీసుకెళ్లే ప్రక్రియ అని అధికారులు చెబుతున్నారు.

ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ కోచింగ్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాల పిల్లలకు ఆ అవకాశం దక్కడం కష్టమే. ఈ అంతరాన్ని తగ్గించేందుకే సీఓఈల్లో ఇంటర్‌తో పాటు జేఈఈ, నీట్ శిక్షణ ఉచితంగా అందిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టడీ సెంటర్ సహకారంతో పేద విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నారు. వసతి, భోజనం, స్టడీ మెటీరియల్, విద్యా సహాయం వంటి సదుపాయాలతో విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.

Also Read : లివర్ ఆరోగ్యానికి కాఫీ అమృతమా..?

నెల్లూరు జిల్లా కోటలోని ఎస్సీ గురుకుల పాఠశాలను సీఓఈగా మార్చే ప్రక్రియలో భాగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కోటలో నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.20 లక్షలతో తరగతి గదులను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. సీఓఈల్లో ప్రవేశాల్లోనూ ఎస్సీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇచ్చారు. 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులకు, 25 శాతం సీట్లు ఇతర వర్గాలకు కేటాయించే విధానం అమలు చేస్తున్నారు. 2026 మార్చిలో పదో తరగతిలో 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఫస్టియర్‌లో ప్రవేశానికి అవకాశం కల్పించారు. ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీ,బైపీసీలో 75 శాతం మార్కులు సాధించిన వారికి సెకండియర్ ప్రవేశానికి అవకాశం కల్పించారు.

గురుకులాలు మూసివేయడమే ప్రభుత్వ లక్ష్యమైతే అక్కడ ఆధునిక తరగతి గదులు ఎందుకు నిర్మిస్తున్నారు..? ఐఐటీ – నీట్ శిక్షణ కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు..? కోట్ల రూపాయలతో కోచింగ్ కోసం టెండర్లు ఎందుకు పిలుస్తున్నారు..? స్పాట్ అడ్మిషన్లు ఎందుకు నిర్వహిస్తున్నారు..? పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ తరహా శిక్షణ ఎందుకు అందిస్తున్నారు..? ఇవన్నీ చూస్తే ‘మూసివేత’ అనే ప్రచారం కంటే గురుకులాల ఉన్నతీకరణ అనే వాస్తవమే కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు గురుకులాలు మూసివేశారంటూ ప్రచారం.. మరోవైపు అదే ప్రాంగణాల్లో ఆధునిక తరగతి గదులు, సీఓఈలు, జేఈఈ – నీట్ శిక్షణ కేంద్రాలు, అడ్మిషన్లు. మూసివేతే లక్ష్యమైతే రూ.20 లక్షలతో తరగతి గదులను ఎందుకు ఆధునికీకరిస్తారు..? తాడికొండలో రూ.3.90 కోట్ల కోచింగ్ ప్రణాళిక ఎందుకు చేపడతారు..? విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్ శిక్షణ ఎందుకు అందిస్తారు..? స్పాట్ అడ్మిషన్లు ఎందుకు నిర్వహిస్తారు..?. ఇవే ఇప్పుడు ప్రచారానికి, వాస్తవానికి మధ్య ఉన్న తేడాను చూపిస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పును రాజకీయంగా వాడుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉచితంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షల శిక్షణ అందించే కార్యక్రమాన్ని పక్కనపెట్టి ‘గురుకులాలు మూసేశారు’ అనే ఒక్క మాటను ప్రచారాస్త్రంగా మార్చడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురుకులం నుంచి సీఓఈకి.. సాధారణ ఇంటర్ నుంచి ఐఐటీ – నీట్ లక్ష్యానికి.. ఇదే కోట. తాడికొండల్లో జరుగుతున్న అసలు మార్పు. వాస్తవం ఇదైతే.. ‘గురుకులాల మూసివేత’ అంటూ సాగుతున్న ప్రచారం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Also Read : చైనాలో ఆ రాత్రి ఇంత ఘోరం జరిగిందా..?2 లక్షల మంది ఎలా..?

గుంటూరు జిల్లా తాడికొండలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని కూడా సీఓఈగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్ విద్యతో పాటు జేఈఈ, నీట్‌కు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందించనున్నారు. కోచింగ్ నిర్వహణ కోసం ప్రైవేట్ విద్యా సంస్థను ఎంపిక చేసేందుకు సుమారు రూ.3.90 కోట్ల విలువైన టెండర్ ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ పర్యవేక్షణలో బోధన, పరీక్షలు, పోటీ పరీక్షల శిక్షణ కొనసాగనుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జగన్‌ని భయపెడుతున్న ఇండియా...

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌...

వైసీపీ నేతలను జగన్...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల...

SC, STలకు జగన్‌...

BCలనే కాదు..వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలను...

300 కోట్ల పెట్టుబడి.....

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడమే...

ఆసియా క్రీడల్లో క్రికెటర్లకు...

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా వచ్చే నెల...

ఇలా అయితే ...

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.....

పోల్స్