Friday, August 28, 2026 03:05 PM
Friday, August 28, 2026 03:05 PM

ఇలా అయితే మా వల్ల కాదు..!

ఏ రాజకీయ పార్టీలో అయినా సరే.. అధినేత చెప్పిన మాటే ఫైనల్. సాధారణంగా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా తమ పార్టీ గెలవాలని కోరుకుంటారు. అదే సమయంలో తమ పార్టీ అధినేత అధికారంలోకి రావాలని కోరుకుంటారు. ఇందుకోసం అహో రాత్రులు కృషి చేస్తారు. దీని వెనుక కొంత స్వార్థం కూడా ఉంటుంది. పార్టీ అధికారంలోకి వస్తే.. తమ కష్టాన్ని గుర్తించిన అధినేత.. తమకు కీలక పదవులు ఇస్తారని ఆశ. దీని వల్ల సమాజంలో గౌరవంతో పాటు అధికార దర్పం చూపించుకునే అవకాశంతో పాటు.. నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చు అనేది పార్టీ నేతలు, కార్యకర్తల మాట. అందుకే అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసం నానా పాట్లు పడతారు.

Also Read : మళ్ళీ తెరమీదకు బీసీ కార్డు.. పాత చరిత్ర మరిచిపోయావా రజనీ?

ఏపీ రాజకీయాలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. అధికారంలో కూటమి పార్టీల నేతలు మళ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం.. మాకెందుకు ఈ ఖర్మ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో సాధారణ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల 10 నెలలు సమయం ఉంది. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం.. మాకేంటి ఈ టార్చర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ పరిస్థితి కొంత అయోమయంగా తయారైంది. ముందుగా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మకాం బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌కు మార్చేశారు. మొదట్లో రెండు నెలలకు ఓసారి తాడేపల్లికి వచ్చారు. ఆ తర్వాత ఏపీలో పరిపాలన, పోలీసుల అరాచకం అంటూ ఓదార్పు యాత్రలు చేశారు. ఏడాది పాటు సైలెంట్‌గా ఉన్న జగన్‌ తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడంతో పాటు.. పార్టీలోని కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరం కావడంతో.. తప్పని పరిస్థితుల్లో జగన్ ప్రస్తుతం వారంలో మూడు రోజులు తాడేపల్లి ప్యాలెస్‌కు వస్తున్నారు. ప్రతి మంగళవారం వచ్చి.. గురువారం సాయంత్రం తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో టీడీపీ నేతలంతా.. ఏపీ టూరిస్ట్ అనే పేరు పెట్టారు.

Also Read : వాళ్ళందరూ భారతీయులే.. నేపాల్ సంచలన ప్రకటన..!

ఇప్పటికే వైసీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో.. పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండాలనే లక్ష్యంతో పార్టీ నేతలకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కొన్ని టాస్కులు ఇస్తున్నారు. వీటికి సంబంధించిన మ్యాటర్ అంతా ప్యాలెస్ నుంచే డిజైన్ చేస్తున్నారు. కానీ.. ప్రింటింగ్ ఖర్చు మాత్రం నియోజకవర్గాల నేతలదే. ముందుగా కోటి సంతకాల సేకరణ అన్నారు.. ఆ తర్వాత మరోటి.. ఆ తర్వాత మరోటి.. ఇప్పుడు డీఎస్సీ‌ స్కామ్ అంటున్నారు.. ఆ తర్వాత బీసీ నేతలపై దాడులంటున్నారు.. ఆ తర్వాత మరోటి.. ఇలా ప్రతి రోజూ ధర్నాలు, ఆందోళనలు చేయాలని ఆదేశిస్తున్నారు. అలాగే అధినేత జగన్ పర్యటన సమయంలో భారీగా జన సమీకరణ చేయాలని కూడా హుకుం జారీ చేస్తున్నారు. కిలోమీటర్ల మేర ర్యాలీలు, ఫ్లెక్సీలు, జనాలను పోగేసి.. ప్రజల్లో జగన్ పట్ల అభిమానం ఇంకా పెరిగిందనేలా చూపించాలని పార్టీ పెద్దలు ప్లాన్ చేశారు. ఇక ఈ పర్యటనల సమయంలో రప్పా రప్పా బ్యానర్లు అదనం.

ప్రస్తుతం పార్టీ ఆదేశించిన ఓ ర్యాలీ నిర్వహించాలంటే.. నియోజకవర్గం స్థాయి నేతకు ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ముందుగా వంద బైకులు, 20 ఆటోలు, కనీసం 500 మంది జనం ఉండాలనేది పార్టీ పెద్దల ఆదేశం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి బైక్‌కు 300 రూపాయలు, 200 రూపాయల పెట్రోల్ ఇవ్వాలి. ఇక ఆటోలకు 500 రూపాయలు, 200 రూపాయలు పెట్రోల్ ఇవ్వాలి. ఇక 500 మంది జనంలో 300 మంది బయట వాళ్లే ఉంటున్నారు. వారిలో ఒక్కొక్కరికి 300 రూపాయలు కూలీ ఇవ్వాల్సి వస్తుందని నేతలు చెబుతున్నారు. ఇక వీరికి బిర్యానీ, మద్యం అదనం. ఇలా ఒక్కొక్కరికి కనీసం వెయ్యి రూపాయల వరకు ఖర్చు అవుతుందనేది నేతలు చెబుతున్న మాట. ఈ లెక్కన వెయ్యి మంది పాల్గొన్న ర్యాలీకి కనీసం పది లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఖర్చు భరించే పరిస్థితుల్లో నేతలు లేరు.

Also Read : ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంట్రీ..!

అయితే ఇక్కడ వైసీపీ నేతలకు మరో పెద్ద సమస్య వచ్చింది. అదే వైసీపీ అధినేత సొంత మీడియా సాక్షి ప్రతినిధులు. పార్టీ సూచించిన కార్యక్రమం ఎలా జరిగింది, ఎంత మంది హాజరయ్యారు అనేది సాక్షి ప్రతినిధులు వివరాలు సేకరించి పార్టీ పెద్దలకు సమాచారం అందిస్తున్నారనేది వైసీపీ నేతల ఆరోపణ. ఇక్కడ మరో విషయం పై కూడా నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకు ఖర్చు చేసిన నేతకు టికెట్ వస్తుందనే నమ్మకం నేతల్లో లేదు. ఇందుకు 2024 ఎన్నికల నాటి పరిస్థితులను నేతలు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో వైసీపీ నేతలు ఈ ఖర్చును భరించేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ మున్సిపాలిటీలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేలా...

సీఎం రేవంత్‌కు మంత్రి...

తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా...

అమరావతిలో మళ్ళీ ల్యాండ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను...

మళ్ళీ తెరమీదకు బీసీ...

మాజీ మంత్రి విడదల రజనీ అప్పుడప్పుడు...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

గత రెండేళ్ళ నుంచి సంచలనంగా మారిన...

ఆ విషయంలో వైసీపీ...

కాలం కలిసి రాకపోతే తాడు కూడా...

పోల్స్