ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని సరికొత్త సంచలనానికి తెరలేపింది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కే కారు ‘ఇ-స్కై’ ప్రొడక్షన్ మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాలలో దీని ప్రారంభ ధరను 20,000 పౌండ్ల అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 26.08 లక్షలు.. లోపుగా నిర్ణయించారు. సుజుకి వ్యాగన్ఆర్ డిజైన్ పోలికలతో, నగర ప్రయాణాలకు మరియు ఇరుకైన రోడ్లపై సులభంగా దూసుకుపోవడానికి వీలుగా ఈ కాంపాక్ట్ బాక్సీ స్ట్రక్చర్‌ను కంపెనీ రూపొందించింది.
Also Read : గుండెపోటు ముప్పును ముందే గుర్తించే టెస్ట్..!
ఈ కారు సాంకేతిక వివరాల్లోకి వెళితే.. ఇందులో అమర్చిన సింగిల్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ 63 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 310 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. పట్టణాలలో రోజువారీ చిన్న చిన్న ప్రయాణాలకు ఇది ఒక చక్కటి ప్రాక్టికల్ ఎంపికగా నిలవనుంది. అంతేకాకుండా, చలి తీవ్రత ఎక్కువగా ఉండే దేశాలలో బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచేలా ఎనర్జీ ఎఫిషియంట్ ‘డైరెక్ట్ హీట్ పంప్ సిస్టమ్’ను కూడా ఇందులో ఉపయోగించారు.
Also Read : నైట్ క్లబ్ రచ్చ.. ఆ క్రికెటర్ కెరీర్ క్లోజ్..?
ఫీచర్ల పరంగా కూడా ఈ చిన్న కారులో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని జోడించారు. కారు లోపల 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బ్యాటరీ ఛార్జ్ ఆధారంగా రూట్‌ను ప్లాన్ చేసే స్మార్ట్ నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి. ట్రాఫిక్‌లో పదే పదే బ్రేక్ వేసే పని లేకుండా కేవలం యాక్సిలరేటర్ పెడల్ ద్వారానే కారు వేగాన్ని తగ్గించే ‘ఈజీ డ్రైవ్ పెడల్’ ఫీచర్, వాహనం నుండి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు పవర్ ఇచ్చుకునే వెహికల్-టు-లోడ్ సౌకర్యం కూడా ఇందులో లభిస్తాయి. భవిష్యత్తులో జీరో-ఎమిషన్ చిన్న రకం కార్ల విభాగంలో పట్టు సాధించడానికి సుజుకి గ్లోబల్ స్ట్రాటజీలో ఈ ‘ఇ-స్కై’ అత్యంత కీలకమైన మోడల్‌గా మారబోతోంది.

