బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ తన ప్రెగ్నెన్సీ సమయానికి సంబంధించిన ఒక అత్యంత వ్యక్తిగత, ఎమోషనల్ విషయాన్ని మొదటిసారిగా బయటపెట్టారు. కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ షూటింగ్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందని ఆమె వెల్లడించారు. చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కియారా మాట్లాడుతూ.. ఆ సమయంలో హీరో యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ స్పందించిన తీరు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : జోగి నీకు ఓ కూతురు ఉంది.. కోడలు మేఘన సంచలనం..!
ఆ వేడుకలో కియారా మాట్లాడుతూ.. “నా ప్రెగ్నెన్సీ విషయం నా కుటుంబ సభ్యుల తర్వాత నేను మొదటిసారి చెప్పింది మీ ఇద్దరికే.. యశ్, గీతూ మోహన్‌దాస్” అంటూ స్టేజ్ పైనే కామెంట్ చేసింది. సాధారణంగా ఒక భారీ ప్రాజెక్ట్ మధ్యలో హీరోయిన్ గర్భవతి అని తెలిస్తే ఏ నిర్మాత లేదా దర్శకుడైనా సినిమా షూటింగ్ ప్రాక్టికాలిటీస్, డేట్స్ గురించి ఆలోచిస్తారు. కానీ ఆ సమయంలో యశ్, గీతూలు సినిమా గురించి అస్సలు ఆలోచించకుండా, కియారా చేతులు పట్టుకుని ఆనంద భాష్పాలు కారుస్తూ.. శుభాకాంక్షలు తెలిపినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు.
Also Read : టెక్కీలకు ట్రంప్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం..!
“మనమంతా ఈ సమయాన్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేయబోతున్నాం కియారా” అంటూ వారు తనను హత్తుకున్నారని తెలిపారు. షూటింగ్ సెట్‌లో తనకు ఎంతో సౌకర్యంగా ఉండేలా చూసుకున్నారని, “సెట్‌కి రా.. నీకు నచ్చింది తిను, హ్యాపీగా ఉండు” అంటూ ఒక కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని కియారా ఎమోషనల్ అయ్యారు. వృత్తిపరమైన బాధ్యతలే కాకుండా వారిలో ఉన్న గొప్ప మానవత్వాన్ని చూసి తాను ఎంతగానో ముగ్ధురాలినయ్యానని, ఆ క్షణంలో తాను ఏమైనా చేయగలననే నమ్మకం తనకు కలిగిందని ఆమె కొనియాడారు. ఈ చిత్రంలో కియారా ‘నాడియా’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఏకైక విజన్‌తో అద్భుతమైన సాంకేతిక నిపుణులు, నటీనటులతో కలిసి ‘టాక్సిక్’ చిత్రాన్ని ఒక అద్భుత కావ్యంగా తెరకెక్కించామని కియారా అద్వానీ గర్వంగా ప్రకటించారు.

