Monday, August 24, 2026 08:02 PM
Monday, August 24, 2026 08:02 PM

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు కాదు… పాపాల ఫలితం

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని అక్రమాలు లేవు, కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు కాదు.. పాపాల ఫలితమని ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కాసుల కోసం కల్తీ మద్యం తయారు చేసి 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెంచారు. చివరికి ఇంటిలోని మహిళలను కూడా మద్యం రవాణా అవినీతి కేసులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కులం, కక్ష అంటూ వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈడీ చర్యలకు కులం, కక్ష రంగు పూయడం అర్థరహితమని అన్నారు. దర్యాప్తును ఎదుర్కొనే ధైర్యం లేక కులం, కక్ష అంటూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Also Read : పాకిస్తాన్ బండారం బయటపెట్టిన జాతీయ మీడియా..!

గత ఐదేళ్ల పాలనలో మద్యం విషయంలో వారు తీసుకున్న నిర్ణయాలపై ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో తెలిసినా… వారి ఏకపక్ష ధోరణి మారడం లేదు. కారుమూరి నాగేశ్వరరావు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు. ఆయన చేపట్టిన అన్ని శాఖల్లోనూ అవినీతి మయం. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కారుమూరి నాగేశ్వరరావు అవినీతి గురించి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌కు తెరదించుతూ ఈడీ కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసింది. మద్యం రవాణాలో అవినీతి చేయడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుటుంబానికి మద్యం రవాణా కుంభకోణంలో బెయిల్ ఇవ్వడానికి కోర్టులు నిరాకరించాయి.

Also Read : వైసీపీ టైం లో లవ్ జీహాద్.. విజయసాయి సంచలనం..!

మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ అన్నారు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తే కులం పేరు తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుంటోంది. వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన వ్యక్తులను చట్టం అరెస్ట్ చేస్తుంటే.. గొడ్డలి పార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలు అంటూ మాట్లాడుతూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అత్యుత్తమ సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాల వారిని ఎంత మందిని అరెస్ట్ చేశారో రాష్ట్ర ప్రజలకు తెలియదా? వైసీపీ నాయకులు ఏం చేసినా తప్పు జరగలేదన్నట్లు జగన్ రెడ్డి మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీలో ఉంటే ఏ తప్పు చేయడానికైనా లైసెన్స్ ఉందా? వైసీపీ హయాంలో కల్తీ మద్యం తాగి మరణించిన కుటుంబాలను వైసీపీ నాయకులు పరామర్శించారా?

Also Read : నాకేం సంబంధం లేదు.. ఏఈ నూకరాజు కేసులో సంచలనం..!

అభివృద్ధిపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతంలో అధికారంతో దుర్మార్గంగా వ్యవహరించిన తీరును వైసీపీ నాయకులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కక్షసాధింపు చర్యలకు పాల్పడటం వైసీపీ నాయకుల ఫార్ములా. మద్యం రవాణాలో కిలోమీటర్‌కు రూ.13 ఉంటే… ఎందుకు రూ.35 పెంచారు? ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పులు చేసిన ప్రతిసారీ రాజకీయ కక్షసాధింపు అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, అవినీతికి 11 సీట్లు ఇచ్చారు. గతంలో చేసిన పాపాల ఫలితమే కారుమూరి అరెస్ట్. వైసీపీ నాయకులకు న్యాయస్థానాలు, వ్యవస్థల పట్ల ఏమాత్రం గౌరవం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. వైసీపీ నాయకులు రాజకీయ ముసుగులో ప్రజలను మబ్బుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

ఆ పదవి వర్ల...

వర్ల రామయ్య.. ఎంతో కాలంగా చట్టసభకు...

పోల్స్