Monday, August 24, 2026 09:40 PM
Monday, August 24, 2026 09:40 PM

పాకిస్తాన్ బండారం బయటపెట్టిన జాతీయ మీడియా..!

అంతర్జాతీయ వేదికలపై తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని, ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని మరోసారి సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైంది. భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” వైమానిక దాడుల్లో ముక్కలు ముక్కలైన జైషే మహ్మద్ ప్రధాన ఉగ్రవాద స్థావరాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత రహస్యంగా, భారీ నిధులతో తిరిగి పునర్నిర్మించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ తన ప్రత్యేక కథనంలో వెల్లడించింది.

Also Read : పాక్ నుంచి పంచదార దిగుమతి..? ఇదేం రోత..?

ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ ఈ టెర్రర్ క్యాంప్ పునర్నిర్మాణానికి ఏకంగా 25 కోట్ల పాకిస్తానీ రూపాయలను కేటాయించింది. బహావల్పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రమైన “మార్కజ్ సుభానల్లా” కాంప్లెక్స్‌లో దెబ్బతిన్న సెంట్రల్ హాల్ రీబిల్డింగ్ కోసమే అందులో 11 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ దాడి జరిగిందనే ఆనవాళ్లే లేకుండా కొత్త ప్లాస్టరింగ్, అత్యాధునిక మౌలిక వసతులు, మెరిసే మార్బుల్ రాళ్లతో ఆ ఉగ్రవాద నిలయాన్ని ఒక కార్పొరేట్ కార్యాలయంలా మార్చివేశారు.

గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో పూర్తిగా ధ్వంసమైన “మదరసా అల్-సాబిర్” అనే బ్రెయిన్ వాషింగ్ సెంటర్‌ను, అలాగే జైషే కమాండర్ల నివాసాలను పూర్తిగా కొత్తగా లేపారు. భారత్‌పై మళ్లీ సరిహద్దు ఉగ్రవాద దాడులు చేయడానికి వీలుగా కొత్త రిక్రూట్‌మెంట్లు, యువతకు మత విద్వేషాలను నూరిపోసే శిక్షణను ఇక్కడ పునఃప్రారంభించబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పునర్నిర్మాణం వెనుక జైషే ఉగ్రవాద నెట్‌వర్క్‌లో జరిగిన కొన్ని కీలక మార్పులు కూడా కారణం. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు.

Also Read : కారుమూరికి ఈడీ షాక్..!

దీంతో ఈ బహావల్పూర్ హెడ్‌క్వార్టర్స్ పూర్తి బాధ్యతలను ఇప్పుడు అతని సోదరులైన తల్హా అల్-సైఫ్, మొహినొద్దీన్ ఔరంగజేబ్ అలియాస్ అమ్మార్ అల్వి తమ చేతుల్లోకి తీసుకున్నారు. కాగా, మసూద్ అజహర్, రౌఫ్ అస్గర్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ప్రస్తుతం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉన్న నవాబ్‌షా ఏరియాలో పాక్ ఆర్మీ అండతో పూర్తి విలాసవంతమైన రక్షణలో సేదతీరుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి. పాకిస్తాన్ అంతర్జాతీయ ఆర్థిక నిబంధనలను, ఎఫ్‌ఏటీఎఫ్ హెచ్చరికలను పూర్తిగా తుంగలో తొక్కి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనడానికి ఈ 25 కోట్ల ఫండింగ్, లగ్జరీ క్యాంప్ నిర్మాణం ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు...

వైసీపీ పాలనలో జరగని స్కామ్‌లు, జరగని...

వైసీపీ టైం లో...

కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం...

విశాఖ స్టీల్ ప్లాంట్.....

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం...

పథకం మంచిదే.. కానీ...

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనేది...

నాకేం సంబంధం లేదు.....

కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక...

పోల్స్