Sunday, October 11, 2026 10:10 PM
Sunday, October 11, 2026 10:10 PM

కారుమూరికి ఈడీ షాక్..!

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మద్యం రవాణా టెండర్లలో జరిగినట్లు అనుమానిస్తున్న అక్రమాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Also Read : ఆ పదవి వర్ల కోసమే..!

ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి ఉన్నారు. మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారా? టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. మద్యం రవాణా టెండర్లలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ సంస్థను వినియోగించిన వ్యవహారంపైనా ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టెండర్ల ప్రక్రియ, సంబంధిత వ్యక్తులు, సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Also Read : గ్రూప్-1 స్కామ్‌.. జగన్‌కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్!

ఇప్పటికే అరెస్టయిన నిందితుల నుంచి లభించిన సమాచారం ఆధారంగా దర్యాప్తును మరింత విస్తరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ కేసులో హవాలా లావాదేవీలు జరిగాయన్న అనుమానాలపైనా ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరింది, టెండర్ల వ్యవహారంతో ఆ లావాదేవీలకు ఉన్న సంబంధం ఏమిటనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరినట్లు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆధార్‌లో పేరు మార్చుకోవాలా?...

ఆధార్ కార్డులో పేరు సవరణ, మార్పులకు...

బ్రేకింగ్: రెండు రోజుల్లో...

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న...

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

పోల్స్