Saturday, August 22, 2026 01:02 PM
Saturday, August 22, 2026 01:02 PM

సాయి రెడ్డితో రాజీ దిశగా జగన్ అడుగులు..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు నంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన మాజీ రాజ్యసభ ఎంపీ వి. విజయసాయి రెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్త ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర సంచలనం రేపింది. తిరుమల శ్రీవారి సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు, త్వరలోనే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి తన రాజకీయ రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తానని స్పష్టం చేయడంతో వైసిపి వర్గాల్లో తీవ్ర కలవరం మొదలైంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విజయసాయి రెడ్డిని ఎలాగైనా శాంతింపజేసి, రాజీ కుదుర్చుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా టాక్ నడుస్తోంది.

Also Read : మెగా బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది.. ఊరమాస్ గ్లింప్స్ రిలీజ్..!

నిజానికి విజయసాయి రెడ్డి గనుక కొత్త జెండా ఎత్తితే.. అది నేరుగా వైసీపీ సాంప్రదాయ ట్విన్ ఓటు బ్యాంక్‌కే భారీ గండి కొడుతుందని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఆందోళన చెందుతోంది. ఒకవేళ ఆయన పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు, వైసిపి కేడర్ ఓట్లు కూడా చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో ఓట్లు చీలిపోతే అది ప్రత్యర్థి పార్టీలకు భారీ అడ్వాంటేజ్‌గా మారుతుందనే భయం జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ ఓట్ల చీలికను ఆపకపోతే పార్టీ కోలుకోలేని దెబ్బ తింటుందని గ్రహించిన జగన్, రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : టాటా కార్లపై భారీ డిస్కౌంట్లు.. రూ. 3.5 లక్షల వరకు ఆఫర్స్..!

ఈ మొత్తం వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరిని, ఆయన మితిమీరిన జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే నాయకులు, సీనియర్లు చాలా కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి కొత్త వేదికను సిద్ధం చేస్తుండటంతో, సజ్జల వ్యతిరేక వర్గమంతా సాయిరెడ్డి వైపు వెళ్లి ఆయన కోసం పనిచేసే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. మరి జగన్ ఆఫర్ చేసే రాజీ ఫార్ములాకు సాయిరెడ్డి లొంగుతారా..? లేక సజ్జల వ్యతిరేక వర్గంతో కలిసి తన సొంత పంథాలోనే ముందుకు వెళ్తారా..? అనేది ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సబ్ రిజిస్ట్రార్‌కు టీడీపీ...

అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే...

ఆగస్టు 24 నుండి...

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట...

భోగాపురం నుంచి విశాఖ...

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి సర్కార్ చర్యలు...

కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న అసమ్మతి..!

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

ఈడీ సోదాలు.. వైసీపీ...

వైసీపీ నేతలు ఏ అంశం అయినా...

కొండా సురేఖ పై...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండా కుటుంబం...

పోల్స్