వైసీపీ నేతల తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పైకి మాత్రం సస్పెన్షన్ అంటారు.. కానీ లోపల మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది కూడా. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేయడమే కాకుండా.. అతని శవాన్ని సొంత కారులోనే డోర్ డెలివరీ చేసిన ఘనత ఒక్క అనంతబాబుకే దక్కుతుంది. వైసీపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న అనంతబాబు.. అధికారంలో ఉన్నామనే పొగరుతో.. ఏం చేసినా చెల్లుతుందనే ధైర్యంతో.. దళితుడిని దారుణంగా కొట్టి హత్య చేయడమే కాకుండా.. అతని శవాన్ని తన కారులోనే తీసుకుని వెళ్లి.. కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేసిన ఘనుడు.
Also Read : కొండా సురేఖ పై వేటు..? రేవంత్ సీరియస్ మీటింగ్..!
ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపడంతో.. అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఇక దళిత సంఘాల నేతలు, నాటి ప్రతిపక్షాల ఆందోళనలతో తప్పని పరిస్థితుల్లో అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధినేత పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. అయితే ఇదంతా పైకి మాత్రం.. వెనుక మాత్రం.. మా అనంత్ కదా.. అని వైసీపీ నేతలంతా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. బెయిల్ పై విడుదలైనప్పుడు, 2024 ఎన్నికలప్పుడు కూడా అనంతబాబుకు వైసీపీ నేతలు ఘన స్వాగతాలు, హారతులతో హోరెత్తించారు. ఇప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతున్నా కూడా.. అనంతబాబు నేరుగా వైసీపీ అధినేత జగన్‌తో కలిసి తిరుగుతున్నాడు.
తాజాగా మరో ఎమ్మెల్సీ వ్యవహరం కూడా ఇలాగే మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇంటి మీదకు దాడికి యత్నించాడు. ఇంటి ముందు జీపు మీద కూర్చుని.. కత్తి పట్టుకుని.. “రా రా నా కొడక..” అంటూ బూతులతో బెదిరింపులకు దిగాడు. ఈ నేత రౌడీయిజానికి ఫిదా అయిన నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆయనను పెద్దల సభకు పంపారు. ఆయన ఎవరో కాదు.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. 60 ఏళ్ల వయసులో భార్య, ఇద్దరు ఆడపిల్లలను గాలికి వదిలేసి.. 30 ఏళ్ల వివాహితతో సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. తిరిగితే తప్పేంటి అని కూడా బెదిరించిన ఘనుడు.
మహిళ భర్తకు, ఈయనకు భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి సహజీవనం చేస్తున్నారు. ఇక ఇప్పటికీ జిల్లాలో వైసీపీ నేతలను బెదిరిస్తున్నారు. వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు చంపేస్తా అంటూ సోషల్ మీడియాలోనే వీడియోలు పోస్ట్ చేసిన ఘనుడు. ఇలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. అయితే ఇదంతా పైకి మాత్రమే. కానీ.. అసలు విషయం ఏమిటంటే.. ఇదే దువ్వాడ తమ పార్టీకి చెందిన ప్రతినిధి అని శాసనమండలి వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ స్వయంగా చెప్పడం.. అందిరనీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడును పెద్దల సభలో ఉన్నామనే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అంబోతు అంటూ సంబోధించాడు దువ్వాడ. ఈ విషయం పెద్ద దుమారం రేపడంతో.. బొత్స స్వయంగా రంగంలోకి దిగారు.
Also Read : భారత్‌లోకి యాపిల్ పే ఎంట్రీ.. లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ఇవే..!
బొత్స ప్రకటనతో దువ్వాడ తిరిగి వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పైకి మాత్రమే సస్పెన్షన్ అంటూ లేఖలు విడుదల చేస్తారు.. కానీ లోపల మాత్రం.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే విమర్శలు ఇప్పుడు వైసీపీ నేతలపై వస్తున్నాయి.

