Saturday, September 26, 2026 08:41 AM
Saturday, September 26, 2026 08:41 AM

మానసిక ఒత్తిడితో కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? డైరెక్ట్ లింక్ ఏంటి..?

నేటి ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి అనేది ఒక సాధారణ భాగం అయిపోయింది. కేవలం జంక్ ఫుడ్ లేదా చెడ్డ ఆహారపు అలవాట్ల వల్లే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది భావిస్తారు. కానీ, మానసిక ఒత్తిడి నేరుగా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచగలదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు, శరీరం అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్‌ లోకి వెళ్తుంది. ఈ సమయంలో అడ్రినలిన్, కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా విడుదలవుతాయి.

Also Read : ఢిల్లీ వేదికగా మళ్లీ బీజేపీకి జగన్ జై..!

ఈ హార్మోన్లు శరీరానికి అవసరమైన శక్తిని అందించే క్రమంలో.. కాలేయం ఎక్కువ గ్లూకోజ్‌తో పాటు, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ఉత్పత్తిని భారీగా పెంచేలా ప్రేరేపిస్తాయి. ఒత్తిడి నిరంతరాయంగా కొనసాగితే, ఈ లిపిడ్ స్థాయిలు అలాగే ఉండిపోయి, రక్తనాళాలు పూడుకుపోయేలా చేస్తాయి. ఒత్తిడి అనేది నేరుగా కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా, మన ఆహారపు అలవాట్లను కూడా మార్చేస్తుంది. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరం ఆకలిని నియంత్రించే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్ల సమతుల్యతను కోల్పోతుంది.

Also Read : స్టార్ హీరోల నెక్స్ట్ లైనప్ ఏమిటి..?

దీనివల్ల ఎక్కువమంది ఎమోషనల్ ఈటింగ్ కు లోనవుతారు. అంటే, ఒత్తిడిని తగ్గించుకోవడానికి తీపి పదార్థాలు, అధిక కొవ్వు ఉండే ఉల్ట్రా- ప్రారాసెస్డ్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తింటారు. కొంతమంది ఒత్తిడి వల్ల ఆల్కహాల్ సేవించడం, అర్ధరాత్రి వేళల్లో విపరీతంగా తినడం అలవాటు చేసుకుంటారు. ఇది శరీరంలో శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఒత్తిడి వల్ల పెరిగే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి సహజమైన లైఫ్‌స్టైల్ మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. వారంలో కనీసం 5 రోజులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే రోజువారీగా ధ్యానం చేయడం వల్ల మన నరాల వ్యవస్థ శాంతించి కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

మజ్లీస్ నుంచి దానం...

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ...

పోల్స్