Thursday, September 17, 2026 05:04 PM
Thursday, September 17, 2026 05:04 PM

పంత్ పై ఎందుకు ఈ కక్ష..? వన్డే కెరీర్ ముగిసినట్లేనా..?

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగబోయే రాబోయే వన్డే సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ వన్డే జట్టులో సెలెక్టర్లు ఊహించని మార్పులు చేశారు. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలను ఎంపిక చేయకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించిన పంజాబ్ ఆల్ రౌండర్ నమన్ ధీర్, జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీలు తొలిసారి అంతర్జాతీయ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.

Also Read : కూటమిలో చిచ్చు పెట్టిన కాంక్లేవ్..!

టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న రికార్డు ఉన్న రిషభ్ పంత్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి ఎందుకు తప్పించారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జట్టు మేనేజ్‌మెంట్‌లోని ముఖ్య సభ్యుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పంత్ తన అసాధారణ ప్రతిభకు తగ్గట్టుగా న్యాయం చేయలేకపోతున్నాడని మేనేజ్‌మెంట్ భావించినట్లు సమాచారం. అయితే, వన్డే జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ, ఇరానీ కప్ కోసం ఎంపిక చేసిన ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ జట్టుకు పంత్‌ను కెప్టెన్‌గా నియమించారు.

Also Read : రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ పంచాయతీ..!

మరోవైపు హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా వన్డే జట్టుకు దూరమయ్యాడు. అతను పూర్తి స్థాయిలో కోలుకుని, ఇండియా-ఏ జట్టు తరఫున ఒక మ్యాచ్‌లో కనీసం 10 ఓవర్ల కోటాను బౌలింగ్ చేసి నిరూపించుకుంటేనే సీనియర్ జట్టులోకి తీసుకుంటామని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది. హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి వన్డే జట్టులో సెలెక్టర్లు పెద్ద పీట వేశారు. హార్దిక్‌కు ప్రత్యామ్నాయంగా నితీష్ రెడ్డిని వన్డేల్లో పరీక్షించాలని భావించిన సెలెక్టర్లు, అతన్ని ఏషియన్ గేమ్స్ టీమ్ నుండి తప్పించి మరీ వన్డే జట్టులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 27 నుంచి తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్