ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన పాపులర్ ఎస్‌యూవీ ‘మహీంద్రా XUV 7XO’ భద్రతలో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్’ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ కారు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఎక్స్‌యూవీ 7XO మోడల్‌కు చెందిన AX7 మరియు AX7L వేరియంట్లు ఈ పరీక్షల్లో పాల్గొని అటు పెద్దలు, ఇటు పిల్లల రక్షణ విభాగాల్లో అత్యంత బలమైన స్కోరును నమోదు చేసినట్లు భారత్ ఎన్‌కాప్ అధికారికంగా వెల్లడించింది.
Also Read : గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై శ్రీకాంత్ ఫైర్..!
పెద్దల రక్షణ విభాగంలో ఈ ఎస్‌యూవీ మొత్తం 32 పాయింట్లకు గాను 30.76 పాయింట్లు సాధించి సులభంగా 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇందులో సైడ్ మూవబుల్ క్రాష్ టెస్ట్‌లో 16కు 16 పర్ఫెక్ట్ పాయింట్లు రావడం విశేషం. అదేవిధంగా, పిల్లల రక్షణ విభాగంలో కూడా 49 పాయింట్లకు గాను 44.97 పాయింట్లు సాధించి అత్యున్నత సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉందని నిరూపించుకుంది. ఈ మోడల్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ చెస్ట్ ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని వరుసల ప్రయాణికులకు రక్షణ కల్పించే హెడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు స్టాండర్డ్‌గా వస్తున్నాయి.
Also Read : గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై శ్రీకాంత్ ఫైర్..!
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఈ 7-సీటర్ మహీంద్రా XUV 7XO ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు గా ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 25.49 లక్షల వరకు పలుకుతోంది. ఈ కారులో భద్రతను మరింత పెంచేందుకు లెవెల్ 2 ADAS ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు డ్రైవర్లకు లభిస్తాయి. టాప్ ఎండ్ మోడల్‌లో ఏకంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 540-డిగ్రీల కెమెరా సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

