Tuesday, September 15, 2026 11:33 AM
Tuesday, September 15, 2026 11:33 AM

ఈరోజు రాశి ఫలితాలు (14-09-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్ల పక్షం.. 14-09-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. ఋణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన ఋణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
—————————————

వృషభం

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.
—————————————

మిధునం

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసివస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి.
—————————————

కర్కాటకం

స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.
—————————————

సింహం

వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.
—————————————

కన్య

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
—————————————

తుల

కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
—————————————

వృశ్చికం

మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
—————————————

ధనస్సు

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన భాధను కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
—————————————

మకరం

ఆత్మీయుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.
—————————————

కుంభం

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త ఋణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
—————————————

మీనం

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్ లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్.. నిరుద్యోగులకు ఏపీ...

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త...

చంద్రబాబు అంటే ఇంత...

తెలుగు రాష్ట్రం ముక్కలైంది. రెండు రాష్ట్రాలుగా...

ప్రతిపక్ష నేతగా తలసాని.....

తెలంగాణ భవన్‌లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ...

లోకల్‌లో జనసేన దూకుడు.....

స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన పార్టీ...

కూటమిలో సీట్ల పంచాయతీ.....

ఆలు లేదు.. సూలు లేదు.. కొడుకు...

ఏపీ అభ్యర్థులకు అలర్ట్.....

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...

పోల్స్