Tuesday, November 3, 2026 04:32 PM
Tuesday, November 3, 2026 04:32 PM

మావిగన్ ఫలితాలు.. మడత పెట్టాయి కదా..!

అనుకున్నంత అయ్యింది.. మునిసిపల్ ఫలితాలు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వానికి ఓటర్ పట్టం కట్టారు. నిన్నటి వరకు ఈవీఎం సీఎం అంటూ గోల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నోటికి బ్యాలెట్ పేపర్‌తో ఓటర్ తాళం వేశాడు. “మా వాడు లేస్తే మనిషి కాదు.. అయితే లేపే వారే లేరు..” అనేది పాత సామెత. ఇప్పుడు వైసీపీ నేతలకు ఆ మాట సరిగ్గా సరిపోయేలా ఉంది. మేము బయటకు వస్తే.. మమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి బయటకు వచ్చి మీ సత్తా చూపించండి అని పిలిస్తే.. మీరు తొండి ఆట ఆడుతున్నారు.. తూచ్ ఈ ఆట మేము ఆడేది లేదంటూ సైలెంట్ అయ్యారు.

Also Read : కూటమి క్లీన్ స్వీప్.. మరీ ఇలా చేస్తారా..?

ఇక అసలు విషయం ఏమిటంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం నమ్మటం లేదు అని మరోసారి స్పష్టమైంది. ఎవరికైనా ఒక్కసారే అవకాశం ఇస్తారు. ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటే.. వారికి భవిష్యత్తు ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వారికైనా సరే.. ఈ మాట సరిగ్గా సరిపోతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి విశ్వసనీయత చాలా ముఖ్యం. కానీ జగన్‌ను జనం నమ్మటం లేదు అని క్లియర్ కట్‌గా తేలిపోయింది. ఈ మాట బ్యాలెట్ రూపంలో కూడా క్లియర్‌గా తీర్పు చెప్పారు ఏపీ ఓటర్లు.

2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్.. తన ఇల్లు తాడేపల్లిలోనే ఉందని.. రాజధాని పరిధిలోనే తనకు సొంత ఇల్లు ఉందని.. కాబట్టి రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని గొప్పగా ప్రకటించారు. నిజమని నమ్మిన రాజధాని అమరావతి పరిధిలోని ఓటర్లు.. వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. అంతే.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. అమరావతి కాదు.. విశాఖ ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అని ప్రకటించారు. మూడు రాజధానుల వల్లే అభివృద్ధి అని విచిత్రమైన మాటలు చెప్పారు. అయితే జగన్ చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో.. 2024 ఎన్నికల్లో 3 రాజధానుల పరిధిలోని వైసీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు.

Also Read : పులివెందుల కోట బద్దలు కొట్టిన కూటమి..?

అంతే.. మళ్లీ నాలుక మడత పెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈసారి మూడు రాజధానులకు బదులుగా మావిగన్ అని కొత్త పాట మొదలుపెట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్ అని పేరు పెట్టి.. రాజధాని చేయాలని వింత ప్రతిపాదన చేశారు. ఆ వెంటనే.. వైసీపీ నేతలంతా.. మావిగన్ సూపర్.. ఆహా, ఓహో.. అంటూ భజనలు చేశారు. అయితే మావిగన్ ప్రతిపాదన పట్ల మూడు పట్టణాల పరిధిలోని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వైసీపీని మచిలీపట్నంలో మడతపెట్టారు.. విజయవాడలో ఈడ్చి కొట్టారు.. గుంటూరులో అయితే.. పక్కన పడేశారు. మావిగన్ అనేది ఎలాంటి ప్రతిపాదనో.. వైసీపీ నేతలకు ఇప్పటికి అర్థమైనట్లుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

పాతికేళ్ళ తర్వాత మాచెర్ల...

పల్నాడు జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మాచర్ల...

కూటమి క్లీన్ స్వీప్.....

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అందరూ...

పులివెందుల కోట బద్దలు...

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన,...

బ్రేకింగ్: బెజవాడకు వరద...

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం...

సీఎం చంద్రబాబుకు అమిత్...

ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుపాన్లు వణికిస్తున్న నేపథ్యంలో...

కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో...

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ కార్పొరేషన్...

పోల్స్