ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు తుపాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన ప్రతీ రైతుకు తగిన పరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఇప్పటికే నాలుగు సార్లు ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాలను వెంటనే రప్పించడంలో ఆయన సఫలీకృతమయ్యారు.
Also Read : మావిగన్ ఫలితాలు.. మడత పెట్టాయి కదా..!
మురసు తుపాను తీవ్రత కారణంగా రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఉన్న దాదాపు 465 గ్రామాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమైనట్లు ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఆయా గ్రామాల్లోని పంట నష్టాల నివేదికలను కేంద్రానికి అందజేస్తూ, తక్షణ సహాయం అందించాలని కోరారు. ముఖ్యమంత్రి చొరవతో రంగంలోకి దిగిన కేంద్ర బృందాలు ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నాయి. మరోవైపు, తుపాను పరిస్థితుల వల్ల శ్రీలంకలోని కొలంబో పోర్టులో ఏపీకి చెందిన మిర్చి కంటెయినర్లు భారీగా నిలిచిపోయాయి.
Also Read : పీఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
ఈ ఎగుమతుల నిలిపివేతతో మిర్చి రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించి, ఎగుమతులు సజావుగా సాగేలా ఆయా దేశాలతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరపాలని కోరుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. వరుస తుపాన్ల కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.


