2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాధ్యతలు చేపడితే.. నవ్యాంధ్ర ప్రదేశ్ ఫస్ట్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడికి అవకాశం దక్కింది. ఆ సమయంలో ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తే.. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
2018లో జరిగిన ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసి.. అట్టహాసంగా ప్రారంభించారు. మరోవైపు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం.. భారీ మెజారిటీతో గెలలిచిన వైసీపీ.. రివర్స్ టెండర్ట పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రివర్స్ చేసింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన కేసీఆర్.. చంద్రబాబుపై ఘన విజయం సాధించినట్లే కనిపించింది.
Also Read : కూటమిలో సీట్ల పంచాయతీ.. తెగుతుందా.. లేదా..?
కానీ 2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. మరోవైపు 2015లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందని ముందే ఊహించిన ఏపీ సీఎం చంద్రబాబు 1300 కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించి.. 2016 నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను తరలిస్తున్నారు. 2024లో మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేశారు.
రెండేళ్లలోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖపట్నం నగరం శివార్ల వరకు గోదావరి నీటిని తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోయినా.. ఎడమ కాలువ ద్వారా నీటిని మళ్లించడానికి 2017లో చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఉపయోగపడింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం, పోలవరం ఎడమ కాలువ పనులకు మొత్తం కలిపి చేసిన ఖర్చు 5 వేల కోట్ల కంటే తక్కువే.
Also Read : ఆరోగ్యప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు కీలక ప్రకటన..!
ఇంత తక్కువ ఖర్చుతో సీఎం చంద్రబాబు అటు కృష్ణా డెల్టాకి.. ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు సాగు, తాగునీరు అందించగలిగారు. పోలవరం కాలువల ద్వారా చంద్రబాబు 500 టీఎంసీల నీటిని తరలిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ వంద టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. పోలవరం ప్రాజెక్టుతో ఏపీలో ఐదు జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారాయి. పట్టిసీమ, పురుషోత్తపట్నం.. ముందు చూపుకి, ఆలోచనకి.. ఉదాహరణలుగా నిలిస్తే.. తొందపాటుతనానికి.. ఆవేశానికి.. నిదర్శనంగా కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిపోయింది.

