Wednesday, September 16, 2026 02:10 PM
Wednesday, September 16, 2026 02:10 PM

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల ఆందోళనలకు కేంద్రం చెక్..!

దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి, ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. డిజిటల్ చెల్లింపుల నియంత్రణపై కేంద్ర ఆర్థిక శాఖ ఒక కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ బ్యాంకులకు, డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. సాధారణ వినియోగదారులు నిత్యం జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయంతో స్పష్టతనిచ్చింది.

Also Read : బ్రేకింగ్: ఏపీ మాజీ మంత్రి కన్నుమూత

ఈ తాజా నోటిఫికేషన్ ప్రకారం… రూ.2,000 వరకు జరిగే యూపీఐ పేమెంట్లతో పాటు ‘రూపే డెబిట్ కార్డు’ ద్వారా చేసే చెల్లింపులపై కూడా ఎలాంటి ఛార్జీలు విధించకూడదు. డబ్బులు పంపించే చెల్లింపుదారుడిపై గానీ, లేదా ఆ డబ్బును స్వీకరించే వ్యక్తిపై గానీ ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను వసూలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల నిత్యం చిన్న వ్యాపారులకు, కిరాణా షాపులకు సామాన్యులు చేసే డిజిటల్ చెల్లింపులు మునుపటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగనున్నాయి.

Also Read : కేంద్రం ఒత్తిడికి దిగొచ్చిన మెటా.. ఆ కంటెంట్‌పై సంచలన నిర్ణయం..!

మరోవైపు, ఒకరి అకౌంట్ నుండి మరొకరి అకౌంట్‌కు వ్యక్తిగతంగా డబ్బులు పంపుకునే పీ-టు-పీ యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం నిర్ధారించింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కీలక ప్రకటనతో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు బ్రేక్ పడటమే కాకుండా, కోట్ల మంది డిజిటల్ చెల్లింపుల వినియోగదారులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ పట్టణాలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు,...

యూపీఐ చార్జీలు.. ఎక్కడ,...

డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు...

ఏపీలో ఉద్యోగాల జాతర.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగార్థులకు కూటమి...

తిరుమలలో హైటెక్ సెక్యూరిటీ..!

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ...

బ్రేకింగ్: ఏపీ మాజీ...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు...

బొత్స కన్నీళ్లు.. లెక్క...

రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారీ...

పోల్స్