Tuesday, November 3, 2026 10:58 AM
Tuesday, November 3, 2026 10:58 AM

మళ్లీ యాత్రల సమయం.. ఇక రెడీ..!

“మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. ఎవరెన్ని యాత్రలు చేసినా సరే.. గెలుపు మాత్రం మాదే.. హ్యాట్రిక్ కొట్టి చూపిస్తాం.. ఈ దెబ్బతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఈ ఎన్నికతో తెలంగాణలో కూడా నామరూపాలు లేకుండా పోతుంది.. రాసిపెట్టుకోండి..”.. సరిగ్గా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పిన మాటలు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలు చేస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి.

Also Read : ఐఏఎస్ అధికారుల చేతికి తిరుమల పాలన..!

సరిగ్గా మూడేళ్ల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఇవే మాటలు ఆయనకు తగిలేలా ఉన్నాయి. ఎందుకంటే.. హ్యాట్రిక్ ఖాయమంటూ 2023 ఎన్నికల కౌంటింగ్ రోజున తుపాకీ గురి పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఫలితం తారుమారైంది. బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి బీఆర్ఎస్ నేతలకు చుక్కలు కనిపించడం మొదలైంది. కేసులు చుట్టుముట్టాయి. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. చివరికి ఎంపీ ఎన్నికల్లో అయితే.. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కూడా రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా సానుభూతి ఓట్లు బీఆర్ఎస్‌కు రాలేదు. అక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది.

ఇక బీఆర్ఎస్ ప్రస్తుత దయనీయ స్థితికి ప్రధాన కారణం.. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరు కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మూడేళ్లుగా ఫామ్ హౌజ్‌కే పరిమితం కావడం.. కనీసం ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాకపోవడం వంటివి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి. ఇదే సమయంలో కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. సొంత అన్న, మేనత్త కొడుకు మీద కేసీఆర్ కుమార్తె కవిత తీవ్ర ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్ ఖతం అనే మాట బాగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు.. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఇటీవల కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

Also Read : మాటల యుద్ధానికి తెర.. ఓటరు తీర్పుకు వేళ!

గతంలో యాత్రలు చేస్తే గెలుస్తారా.. అని ఎద్దేవా చేసిన కేటీఆర్.. తాజాగా అదే యాత్రలను నమ్ముకున్నారు. నవంబర్ 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజుల పాటు కేటీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. మేడిగడ్డ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర, గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల మీదుగా సాగుతుందని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తూ, రైతుల ఇబ్బందులను ఆధారాలతో ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో చారిత్రక ఘట్టమైన దీక్షా దివస్ను పురస్కరించుకుని నవంబర్ 29న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2009లో కేసీఆర్‌ను అరెస్టు చేసిన అలుగునూరు లేదా నుస్తులాపూర్ ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మాటల యుద్ధానికి తెర.....

ఎన్నికల సమరం ముగిసింది.. ఇక రాజకీయ...

తక్కువ పోలింగ్ కారణాలేమిటీ..?

తిరుపతి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో...

తెలంగాణాపై గురిపెట్టిన అమిత్...

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్...

ఐఏఎస్ అధికారుల చేతికి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలపై...

సాయిరెడ్డి కొత్త పార్టీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయ వేదికగా...

30 ఏళ్ల తర్వాత...

కడప జిల్లా రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం...

పోల్స్