Monday, November 2, 2026 07:31 PM
Monday, November 2, 2026 07:31 PM

మాటల యుద్ధానికి తెర.. ఓటరు తీర్పుకు వేళ!

ఎన్నికల సమరం ముగిసింది.. ఇక రాజకీయ పార్టీల అసలు బలమెంతో తేలే సమయం వచ్చేసింది. ప్రచారంలో హామీల వర్షం కురిపించిన నేతలకు ఓటరు ఎలాంటి తీర్పు ఇచ్చాడో బయటపడనుంది. మున్సిపాలిటీల్లో ఎవరి రాజకీయ ఆధిపత్యం నిలబడింది.? ఎవరి అంచనాలు తలకిందులయ్యాయి.? ఎవరికి పదవులు దక్కనున్నాయి.? ఎవరికి పరాభవం తప్పనుంది.? బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైన ఓట్లే ఇప్పుడు నేతల రాజకీయ భవిష్యత్తుకు గీటురాయిగా మారాయి. మున్సిపాలిటీల్లోనూ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం. ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యే ఓట్ల లెక్కింపుతో రాజకీయ లెక్కలు తేలనున్నాయి. బ్యాలెట్ పెట్టెలే నేతల బలాబలాలను బయట పెట్టనున్నాయి. ఎన్నికల ప్రచార హోరు ముగిసింది.. ఓటర్ల తీర్పు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైంది.

Also Read : హైదరాబాద్ కి పొంచి ఉన్న నీటి సమస్య.. తక్షణ కర్తవ్యమేంటి?

గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. లెక్కల్లో ఎవరికి వారే పైచేయి సాధించామంటూ అంచనాలు వేసుకుంటున్న వేళ అసలు ఫలితం తేలే సమయం ఆసన్నమైంది. మున్సిపాలిటీల్లో రాజకీయ ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నవంబరు 3న ఉదయం 8 గంటలకు కేంద్రాల్లో ఏకకాలంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎవరికి ప్రజలు పట్టం కట్టారు..? ఎవరికి నిరాశ తప్పనుంది..? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకే కాకుండా ఆయా పార్టీల నాయకత్వాలకు సైతం ఈ ఫలితాలు కీలకంగా మారనున్నాయి.

Also Read : ఆ విద్యార్థులకు ధైర్యం కోసం.. లోకేష్ వినూత్న ప్రయత్నం

ఈ ఓట్లే ఇప్పుడు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మున్సిపాలిటీల్లో రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. దీంతో మధ్యాహ్నానికే ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో వార్డు సభ్యుడితోపాటు చైర్‌పర్సన్ అభ్యర్థికి కూడా వేర్వేరుగా ఓటు వేయడంతో కౌంటింగ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుపు బ్యాలెట్ ద్వారా వార్డు సభ్యుల ఓట్లు.. గులాబీ బ్యాలెట్ ద్వారా చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, పరిశీలకుల కోసం వేరుగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. దీంతో రెండు రకాల ఓట్ల లెక్కింపు సమాంతరంగా సాగనుంది.

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ పెట్టెలను సీసీ కెమెరాల నిఘాలో, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో కౌంటింగ్ హాళ్లు తరలించనున్నారు. గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. సెల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు సాయుధ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ. టేబుళ్ల కేటాయింపు, భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

Also Read : 30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం

మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద తమ అభ్యర్థుల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూడనున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న అభ్యర్థుల అంచనాలు నిజమవుతాయా..? ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో..? అన్నది తేలేందుకు మరికొన్ని గంటలే మిగిలాయి. మున్సిపాలిటీల్లో రేపటి ఫలితాలు స్థానిక రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

తక్కువ పోలింగ్ కారణాలేమిటీ..?

తిరుపతి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో...

తెలంగాణాపై గురిపెట్టిన అమిత్...

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్...

ఐఏఎస్ అధికారుల చేతికి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా వ్యవహారాలపై...

సాయిరెడ్డి కొత్త పార్టీ...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయ వేదికగా...

30 ఏళ్ల తర్వాత...

కడప జిల్లా రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం...

ఆ విద్యార్థులకు ధైర్యం...

రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన...

పోల్స్