Tuesday, November 3, 2026 08:11 PM
Tuesday, November 3, 2026 08:11 PM

తక్కువ పోలింగ్ కారణాలేమిటీ..?

తిరుపతి, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. అయితే ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత తక్కువ పోలింగ్ శాతం నమోదుకు కారణమనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విశాఖపట్నం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లు కూటమి పార్టీలకు కంచుకోటలు. అక్కడే తక్కువ పోలింగ్ జరగటం వెనుక.. ఆయా పార్టీల అభిమానుల అసంతృప్తే కారణమనే మాట బాగా వినిపిస్తోంది. ఈ విషయం పార్టీ పెద్దలకు తెలియదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read : 30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం

విశాఖలో ఓసీలకు కేటాయించిన డివిజన్‌లలో కూడా బీసీ అభ్యర్థులను ఎంపిక చేయటం.. పార్టీపరంగా బీసీలకు 34 శాతం కన్నా, 76 శాతం ఎక్కువ వార్డులలో బీసీ కులాలకు చెందిన కార్పొరేటర్‌లను ఈ ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. అయితే ఇదే ఏసీ కులానికి చెందిన ఓటర్లకు మింగుడు పడినట్లు లేదు. టీడీపీ, జనసేన పార్టీలే కాదు.. చివరకు బీజేపీ కూడా కనీసం ఒక్క వార్డులో కూడా ఓసీ కులాలకు చెందిన వారికి అవకాశం ఇవ్వలేదు. మూడు పార్టీలు ఒకే బాటలో నడవటంతో.. ఆయా పార్టీలను అభిమానించే ఓసీ కులాల ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. విశాఖ నగరం పరిధిలో బ్రాహ్మణ కులానికి చెందిన ఓట్లు దాదాపు రెండు లక్షలు పైనే ఉన్నాయి. కానీ వారికి కనీసం ఒక్క డివిజన్ కూడా మూడు పార్టీలు అవకాశమివ్వలేదు. ఓసీలకు ఈ విషయం కాస్త ఇబ్బంది కలిగించినట్లుగా ఉందని.. తీవ్ర అసంతృప్తి కారణంగానే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారంటున్నారు.

అలాగే తిరుపతి మున్సిపల్ మేయర్ అభ్యర్థి ఎంపికలో కూడా తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలకు ఊహించని షాక్ తగిలింది. ముందు నుంచి తిరుపతి మేయర్ సీటును జనసేన పార్టీ నేతలు ఆశించారు. అయితే.. చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దీంతో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి అభిమానులు నామినేషన్ సమయంలో ఈనాడు పత్రిక విలేకరిపై దాడి చేసిన ఘటన తిరుపతిలో బాగా వైరల్ అయ్యింది. చివరికి అభ్యర్థి స్వయంగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత కూడా టీడీపీ అభ్యర్థి అనుచరుల తీరుపై సొంత పార్టీ నేతలే కాస్త గుర్రుగా ఉన్నారు.

వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతను మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పగించారు. ఇప్పటికే భూమన అరాచకాలు, భూమన అనుచరుల దౌర్జన్యాలను ప్రత్యక్షంగా చూసిన మెజారిటీ ఓటర్లు.. ఓటింగ్‌కు దూరంగా ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఓసీ మేయర్ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించడం కూడా తిరుపతి వైసీపీ నేతలకు మింగుడు పడలేదు. మరో విషయం ఏమిటంటే.. రాష్ట్రమంతా కూటమి గాలి వీస్తుంటే.. మనం మాత్రం వైసీపీకి ఓటు ఎందుకు వేయాలని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగడం పట్ల వైసీపీ నేతలపై ఓటర్లు గుర్రుగా ఉన్నారు. తిరుమల శ్రీవారి సన్నిధి యాదవ కులానికి చెందిన అభ్యర్థి అంటూ ప్రచారం చేయటంపై మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : సాయిరెడ్డి కొత్త పార్టీ వెనుక ఆ ఆరుగురు ఎవరు..?

అటు టీడీపీ, ఇటు వైసీపీ అగ్రనేతలు.. మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికలో తప్పులు చేశారని.. అదే ఓటింగ్ శాతం తగ్గటానికి ముఖ్య కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాధారణంగా పట్టణ ఓటర్లు అంటే.. చదువుకున్న వారే అధికంగా ఉంటారు. అలాంటి వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకురావడంతో అధికార కూటమి పార్టీల నేతలు పూర్తిగా విఫలమయ్యారనేది సుస్పష్టం. గ్రేటర్ కార్పొరేషన్ల పరిధిలోనే కార్యకర్తలు, నేతలు సరిగ్గా పని చేయకపోతే.. రాబోయే ఎన్నికల్లో ఎలా చేస్తారనే మాట బాగా వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బొత్స వారసురాలికి షాక్...

సినిమాల్లో, రాజకీయాల్లో వారసులు సక్సెస్ కావడం...

మావిగన్ ఫలితాలు.. మడత...

అనుకున్నంత అయ్యింది.. మునిసిపల్ ఫలితాలు వెలువడ్డాయి....

పాతికేళ్ళ తర్వాత మాచెర్ల...

పల్నాడు జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మాచర్ల...

కూటమి క్లీన్ స్వీప్.....

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అందరూ...

పులివెందుల కోట బద్దలు...

వైఎస్సార్ కడప జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన,...

బ్రేకింగ్: బెజవాడకు వరద...

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షం...

పోల్స్