Wednesday, September 16, 2026 01:49 PM
Wednesday, September 16, 2026 01:49 PM

ఈరోజు రాశి ఫలితాలు (16-09-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్ల పక్షం.. 16-09-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
—————————————

వృషభం

వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.
—————————————

మిధునం

నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
—————————————

కర్కాటకం

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
—————————————

సింహం

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.
—————————————

కన్య

నూతన ఋణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.
—————————————

తుల

ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
—————————————

వృశ్చికం

దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
—————————————

ధనస్సు

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
—————————————

మకరం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.
—————————————

కుంభం

వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
—————————————

మీనం

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
—————————————

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ పట్టణాలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు,...

యూపీఐ చార్జీలు.. ఎక్కడ,...

డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు...

ఏపీలో ఉద్యోగాల జాతర.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగార్థులకు కూటమి...

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల...

దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు...

తిరుమలలో హైటెక్ సెక్యూరిటీ..!

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ...

బ్రేకింగ్: ఏపీ మాజీ...

ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు...

పోల్స్