Thursday, September 17, 2026 01:57 PM
Thursday, September 17, 2026 01:57 PM

కూటమిలో చిచ్చు పెట్టిన కాంక్లేవ్..!

అధికార కూటమిలో పైకి సమన్వయం కనిపిస్తున్నా.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అంతర్గతంగా విభేదాల చర్చ ఊపందుకుంటోంది. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కాలి? ఏ ప్రాంతంలో ఎవరు పోటీ చేయాలి? అనే అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడం కూటమి పార్టీల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. సమన్వయ సమావేశాల పేరుతో మూడు పార్టీల మధ్య గ్యాప్ లేదని నేతలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం తమ బలాన్ని చాటుకునే ప్రయత్నాలు మొదలయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనలు తమ కిందిస్థాయి కేడర్‌ను సమీకరించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల స్థాయిలో పార్టీ శ్రేణులను కదిలించి ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకోవాలనే ఉద్దేశంతో నాయకత్వం నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం.

Also Read : పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన భారత్..!

టీడీపీ అధిష్ఠానం ‘లీడర్షిప్ కాంక్లేవ్’ పేరుతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఇదే సమయంలో నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ నిధుల ప్రకటన రావడాన్ని ప్రతిపక్షాలు, రాజకీయ వర్గాలు తమదైన రీతిలో విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల ముందు అభివృద్ధి నిధుల ప్రకటనను కొందరు రాజకీయంగా ప్రాధాన్యమైన అంశంగా చూస్తుండగా.. ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే దీనిని వివరిస్తోంది.

మరోవైపు జనసేన కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ‘స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం పేరుతో తాడేపల్లిలో సమావేశం నిర్వహించింది. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నాయకత్వం సూచించినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీకి తగిన ప్రాతినిధ్యం ఉండాలనే అంశాన్ని జనసేన ఇప్పటికే కూటమి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై వివిధ సంఖ్యలు, ప్రతిపాదనలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తుది సర్దుబాటుపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పార్లమెంటరీ కూటమి సమావేశాల్లో పార్టీ విధానాన్ని మాత్రమే వెల్లడించాలని, సీట్ల కేటాయింపు, సర్దుబాట్లు పార్టీ అధ్యక్షుడి పరిధిలో ఉంటాయని నేతలకు సూచించినట్లు సమాచారం. పార్టీ శ్రేణుల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

Also Read: ఈ అరుదైన రికార్డ్ చంద్రబాబుకే సాధ్యం

మరోవైపు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొంతకాలంగా పలు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రివర్గ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరైన సందర్భాలున్నాయి. ఆరోగ్య కారణాలతో కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేదని అప్పట్లో వివరణలు వచ్చాయి. అసెంబ్లీ చివరి రోజు మాత్రం పవన్ కల్యాణ్ హాజరై జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. అదే సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న నారా లోకేష్‌తో ఆయన భేటీ కాలేదన్న అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇద్దరూ కొద్ది నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లిపోయారని, అయితే పరస్పరం కలుసుకోలేదని ప్రచారం జరిగింది. ఈ నెల 10, 11 తేదీల్లో జరిగిన కలెక్టర్ల సదస్సుకు కూడా పవన్ హాజరు కాలేదు. ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు కూటమిలో అంతర్గత సమన్వయంపై చర్చిస్తున్నారు. అయితే గైర్హాజరును రాజకీయ విభేదాలకు నేరుగా ముడిపెట్టడం కంటే ఆయా సందర్భాల్లో ఇచ్చిన అధికారిక వివరణలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని మరో వర్గం అభిప్రాయపడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పాపం బొత్స.. రాజకీయ...

విజయనగరం జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది....

ఈ అరుదైన రికార్డ్...

తిరుమల వేంకటేశ్వరుడు సీఎం చంద్రబాబు ఇష్టదైవం.....

కోర్ట్ లో ఐబొమ్మ...

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన ప్రముఖ...

పోల్స్