Thursday, September 17, 2026 01:50 PM
Thursday, September 17, 2026 01:50 PM

గ్రామాల్లో అభివృద్ధి పండుగ, పవన్ కృషితో మారుతున్న రూపురేఖలు..!

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పెట్టిన ఫోకస్ కు మంచి ఫలితాలు వస్తున్నాయి. గత రెండున్నరేళ్ల కాలంలో గ్రామీణాభివృద్ధిని ఒక పండుగలా నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగానే పల్లెల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ రికార్డు స్థాయిలో 10,000 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, అలాగే 9,600 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

Also Read: కోర్ట్ లో ఐబొమ్మ రవి సంచలన పిటీషన్..!

ఈ అభివృద్ధి కేవలం మైదాన ప్రాంతాలకే పరిమితం కాకుండా, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు సైతం ‘అడవితల్లి బాటలు’ పేరిట 1,000 కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించి వారి కష్టాలను తీర్చారు. మౌలిక వసతులతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన వ్యవసాయ, పశుపోషణ రంగాలకు ఈ అభివృద్ధి పండుగ కొండంత అండగా నిలిచింది. అన్నదాతల సాగు నీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల పంట కుంటలను నిర్మించడమే కాకుండా, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ 2 లక్షల ఎకరాలలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించారు.

Also Read : వైసీపీ ఒక్క సీటు గెలవదు.. తమ్మినేని తనయుడి సంచలనం.!

అంతేకాకుండా, పాడి రైతుల ఆర్థిక రక్షణ కోసం 38,000 మినీ గోకులాలు, పశువుల దాహార్తిని తీర్చేందుకు 15,000 నీటి తొట్టెలను నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో పాడి-పంటల సమృద్ధికి బాటలు వేశారు. ఇప్పటివరకు సాధించిన అద్భుతమైన విజయాల స్ఫూర్తితో, ఇప్పుడు ప్రభుత్వం మరింత రెట్టించిన ఉత్సాహంతో ‘పల్లెపండుగ 3.0’ నిర్వహణకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా వీబీ జీ-రాంజీ, సాస్కీ తదితర వినూత్న పథకాల ద్వారా ప్రతి పల్లెనూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలను రూపకల్పన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో సాగుతున్న ఈ ప్రగతి ప్రస్థానం పల్లెల్లో నిరంతర అభివృద్ధి పండుగను తలపిస్తూ, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

కూటమిలో చిచ్చు పెట్టిన...

అధికార కూటమిలో పైకి సమన్వయం కనిపిస్తున్నా.....

పాపం బొత్స.. రాజకీయ...

విజయనగరం జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది....

ఈ అరుదైన రికార్డ్...

తిరుమల వేంకటేశ్వరుడు సీఎం చంద్రబాబు ఇష్టదైవం.....

కోర్ట్ లో ఐబొమ్మ...

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన ప్రముఖ...

పోల్స్