సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్ రమానందన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. యూకే వీసాలు ఇప్పిస్తామని మోసం చేసారనే ఆరోపణల నేపధ్యంలో, విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నందూస్ వరల్డ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన ఆమె, ప్రస్తుతం పలు చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా ఆమె పోలీసులకు చేసిన ఒక విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన భారత్..!
తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసులను తాత్కాలికంగా రద్దు చేసి, తనను లండన్ వెళ్లేందుకు అనుమతించాలని ఆమె తరఫు న్యాయవాది పోలీసులను కోరారు. లండన్‌లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేశారనేది రమానందన, ఆమె భర్త మధుకర్‌లపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంతో పాటు ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్లలో వీరిపై బాధితులు ఫిర్యాదులు చేశారు.
Also Read: చంద్రబాబు సంచలన ప్రకటన.. భక్తులకు ఇన్సూరెన్స్..!
దాదాపు రూ.13 లక్షలకు పైగా ఇచ్చి మోసపోయామంటూ బాధితులు ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఏపీ పోలీసులు ఆమెపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. గత నెలలో ఆమె లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు రమానందనను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అప్పట్లో జరిగిన ప్రాథమిక విచారణలోనే ఆమె పోలీసులకు షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తనకు కన్సల్టెన్సీ లావాదేవీలతో కానీ, వీసాల వ్యవహారంతో కానీ ఎలాంటి సంబంధం లేదని, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఆఫీస్ నిర్వహణ అంతా తన భర్త మధుకరే చూసుకున్నాడని, తనను కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే వాడుకున్నారని ఆమె పోలీసుల ముందు చెప్పడం గమనార్హం.

