తిరుమల వేంకటేశ్వరుడు సీఎం చంద్రబాబు ఇష్టదైవం.. ఆయన వల్లే తానీ స్థాయికి చేరానని ఆయన పదేపదే చెబుతుంటారు. ఆయనకు సేవ చేయడం తనకు లభించిన అవకాశంగా భావిస్తారు. పవిత్రమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం సుదీర్ఘకాలంగా వస్తున్న ఆనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు ముఖ్యమంత్రి సాంప్రదాయ దుస్తులు ధరించడం మరియు తలకు తలపాగా అంటే పరివట్టం చుట్టుకోవడం విశిష్టమైన ఆనవాయితీ.
Also Read : కోర్ట్ లో ఐబొమ్మ రవి సంచలన పిటీషన్..!
అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో వస్త్ర ప్రసాదం ముఖ్యమంత్రి తలకు తలపాగా చుడతారు. దీనిని ఆధ్యాత్మిక పరిభాషలో పరివట్టం అంటారు. ఇది స్వామివారి ఆశీస్సులకు, ఆలయ మర్యాదకు సంకేతం. పట్టువస్త్రాలను పల్లెరం అంటే వెండి తంబూలంలో ఉంచి, తలపై పెట్టుకుని ఆలయ వీధుల్లో ఊరేగింపుగా మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్తారు. పట్టువస్త్రాలు అత్యంత పవిత్రమైనవి కాబట్టి, వాటిని తలపై మోసుకొని వెళ్లేటప్పుడు తలపాగా ధరించడం భక్తికి, వినయానికి మరియు సాంప్రదాయ నిష్ఠకు ప్రతిరూపంగా భావిస్తారు.
Also Read : చంద్రబాబు సంచలన ప్రకటన.. భక్తులకు ఇన్సూరెన్స్..!
నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995లో ప్రభుత్వం తరఫున మొదటిసారిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వివిధ విడతల్లో అంటే 1995-2004, 2014-2019, మరియు 2024 నుండి ప్రస్తుత పదవీకాలం వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యధిక సార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 1995, 1996, 1997, 1998, 1999, 2000, 2001, 2002, 2003 వరుసగా 9 ఏళ్ళు శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి అరుదైన ఘనత సాధించారు. ఆ తర్వాత 2014, 2015, 2016, 2017, 2018 వరుసగా 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించారు.
Also Read : కోర్ట్ లో ఐబొమ్మ రవి సంచలన పిటీషన్..!
కొన్ని సంవత్సరాలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండూ వచ్చినప్పుడు కూడా ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు అందజేశారు. అంటే ఏడాదికి రెండుసార్లు పట్టు వస్త్రాలు అందచేసే అవకాశం దక్కింది. మొత్తం 15 సార్లు సీఎం హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. ఇది ఎవరికీ సాధ్యం కాని రికార్డు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
– జి.సత్యనారాయణ రాజు

