Wednesday, September 16, 2026 06:20 PM
Wednesday, September 16, 2026 06:20 PM

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు రేవంత్ ఆదేశాలు!

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెంటనే నోటీసులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల యాజమాన్య పత్రాలు, రెవెన్యూ రికార్డులు, సర్వే నంబర్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో సుమారు 340 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. మొత్తం ఫామ్‌హౌస్ పరిధి ఎంత? అందులో పట్టా భూమి ఎంత? ప్రభుత్వ భూమి ఎంత? అనే వివరాలను నిగ్గుతేల్చాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు ఆధీనంలోకి ఎలా వెళ్లింది? రెవెన్యూ రికార్డుల్లో ఎలాంటి మార్పులు జరిగాయి? ఆ భూములపై ప్రస్తుతం ఎవరి పేర్లు ఉన్నాయి? అనే అంశాలన్నింటినీ విచారణలో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

Also Read : చంద్రబాబు సంచలన ప్రకటన.. భక్తులకు ఇన్సూరెన్స్..!

ఈ విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేసి, సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని సీఎం గడువు విధించారు. నిర్ణీత సమయంలో విచారణ పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, బాధ్యులైన మంత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణలో అది ప్రభుత్వ భూమేనని తేలితే స్వాధీనం చేసుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అనంతరం ఆ భూమిని దళితులు, నిరుపేదలకు పంపిణీ చేస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన భూముల వివరాలను కూడా ముఖ్యమంత్రి సభలో ప్రస్తావించారు.

Also Read : జగన్ రెడ్డి కాదా.. వైసీపీ నేతలకు సాయిరెడ్డి సూటి ప్రశ్న..!

తెలంగాణ ఉద్యమం, ధరణి వ్యవస్థను అడ్డుపెట్టుకొని భూములు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై కేసీఆర్ లేదా బీఆర్ఎస్ నాయకత్వం నుంచి వచ్చే సమాధానం ఇప్పుడు రాజకీయంగా కీలకం కానుంది. ప్రభుత్వ విచారణపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది? న్యాయపోరాటానికి దిగుతుందా? లేక భూములకు సంబంధించిన పత్రాలను ప్రజల ముందుంచుతుందా? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఇవన్నీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు మాత్రమే. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉందా లేదా అన్నది అధికారిక సర్వే, రెవెన్యూ రికార్డుల పరిశీలన, విచారణ పూర్తయిన తర్వాతే నిర్ధారణ కానుంది.

మరి ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి? ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని పేదలకు పంచడం సాధ్యమవుతుందా? లేక ఇది కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య మరో రాజకీయ యుద్ధంగా మారుతుందా?

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఈ అరుదైన రికార్డ్...

తిరుమల వేంకటేశ్వరుడు సీఎం చంద్రబాబు ఇష్టదైవం.....

కోర్ట్ లో ఐబొమ్మ...

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన ప్రముఖ...

చంద్రబాబు సంచలన ప్రకటన.....

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు...

జగన్ రెడ్డి కాదా.....

త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన...

వైసీపీ ఒక్క సీటు...

ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది....

చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర...

ఇస్లాం మతస్తుల అత్యంత పవిత్ర నగరమైన...

పోల్స్