Wednesday, September 16, 2026 06:20 PM
Wednesday, September 16, 2026 06:20 PM

కోర్ట్ లో ఐబొమ్మ రవి సంచలన పిటీషన్..!

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐ-బొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి తాజాగా హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా తన బ్యాంక్ ఖాతాలను స్తంభించింపజేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన కనీస అవసరాలు, కుటుంబ పోషణ నిమిత్తం పోలీసులు జప్తు చేసిన సొమ్ములో నుండి రూ. 3 కోట్లను తిరిగి ఇప్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : వైసీపీ ఒక్క సీటు గెలవదు.. తమ్మినేని తనయుడి సంచలనం.!

గత ఏడాది నవంబర్‌లో కుకట్‌పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన రవి.. దాదాపు 90 రోజుల పాటు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తులో భాగంగా పోలీసులు రవికి సంబంధించిన దాదాపు 35 బ్యాంక్ ఖాతాలను, ప్రాపర్టీలను సీజ్ చేసి సుమారు రూ. 3.5 కోట్ల నగదును హోల్డ్‌లో పెట్టారు. అక్రమ పైరసీ, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనల ద్వారా ఆయన రూ. 20 కోట్ల వరకు ఆర్జించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Also Read : ఏపీ పట్టణాలకు మహర్దశ.. భారీ ప్రాజెక్ట్ లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

బ్యాంక్ అకౌంట్లన్నీ లాక్ అవ్వడంతో ప్రస్తుతం చేతిలో రూపాయి లేక నిత్యావసర వస్తువులు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నానని రవి పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో కనీసం ఇల్లు గడవడానికి వీలుగా తన ఖాతాలలో కొన్నింటినైనా అన్‌ఫ్రీజ్ చేయాలని కోరారు. ఇమ్మడి రవి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కోర్టు నిందితుడి అభ్యర్థనపై పోలీసుల నుండి పూర్తి వివరణ కోరే అవకాశముంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఈ అరుదైన రికార్డ్...

తిరుమల వేంకటేశ్వరుడు సీఎం చంద్రబాబు ఇష్టదైవం.....

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు...

చంద్రబాబు సంచలన ప్రకటన.....

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు...

జగన్ రెడ్డి కాదా.....

త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన...

వైసీపీ ఒక్క సీటు...

ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది....

చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర...

ఇస్లాం మతస్తుల అత్యంత పవిత్ర నగరమైన...

పోల్స్