Wednesday, September 16, 2026 07:20 PM
Wednesday, September 16, 2026 07:20 PM

పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన భారత్..!

భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పుడు సముద్ర జలాలకు కూడా చేరాయి. ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నావికాదళ యుద్ధనౌకను పాకిస్తాన్ నౌక ప్రమాదకర రీతిలో వచ్చి బలంగా ఢీకొట్టింది. పాక్ నావికాదళానికి చెందిన హునైన్-క్లాస్ కార్వెట్ యుద్ధనౌక అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా దూసుకువచ్చి భారత ఫ్రంట్‌లైన్ వార్‌షిప్‌ను తాకుతూ వెళ్ళిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. సముద్రం తీవ్రంగా అలజడిగా ఉన్న సమయంలో పాక్ నావికాదళం ఉద్దేశపూర్వకంగానే అత్యంత దురహంకారంతో, కక్షపూరితంగా ఈ చర్యకు పాల్పడిందని సమాచారం.

Also Read : యూపీఐ చార్జీలు.. ఎక్కడ, ఎంత పడతాయి అంటే..?

ఈ ప్రమాదకర ఘటనపై భారత విదేశాంగ శాఖ అత్యంత తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ తాత్కాలిక అధిపతి సాద్ అహ్మద్ వారియాచ్‌ను భారత విదేశాంగ శాఖ తన జనపథ్ కార్యాలయానికి తక్షణమే సమన్లు జారీ చేసి పిలిపించింది. అంతర్జాతీయ జలాల్లో పాక్ నావికాదళం ప్రదర్శించిన “అంగీకరించలేని, బాధ్యతారహితమైన ప్రవర్తన”పై భారత్ తన నిరసనను నమోదు చేసింది. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో.. రెండు దేశాల మధ్య సైనిక కదలికల ముందస్తు సమాచారంపై 1991లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలోని ఆర్టికల్ 10 నిబంధనలను పాకిస్తాన్ పూర్తిగా ఉల్లంఘించిందని భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read : చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర నగరం మక్కాలో ఎయిర్ రైడ్ అలర్ట్..!

అదృష్టవశాత్తూ ఈ దారణ ఘటనలో భారత యుద్ధనౌకకు ఎలాంటి పెద్ద నష్టం వాటిల్లలేదు, సైనికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ఇటువంటి బాధ్యతారాహిత్యమైన చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తమ సైనిక విభాగాలను అప్రమత్తం చేయాలని పాక్ రాయబారికి ఢిల్లీ హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లామాబాద్‌లోని భారత రాయబారి కూడా ఇదే తరహా తీవ్ర నిరసనను పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నేరుగా అందజేయాలని కేంద్రం ఆదేశించింది. గతంలో 2011 జూన్‌లో కూడా పాక్ నౌక ‘బాబర్’, భారత ‘ఐఎన్ఎస్ గోదావరి’ నౌకలు ఇలాగే సముద్రంలో ఢీకొట్టుకున్న తరుణంలో.. మళ్లీ పదిహేనేళ్ల తర్వాత పాకిస్తాన్ సముద్ర మార్గంలో ఇలాంటి కయ్యానికి కాలు దువ్వడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఈ అరుదైన రికార్డ్...

తిరుమల వేంకటేశ్వరుడు సీఎం చంద్రబాబు ఇష్టదైవం.....

కోర్ట్ లో ఐబొమ్మ...

తెలుగు సినీ పరిశ్రమను వణికించిన ప్రముఖ...

కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణకు...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై సమగ్ర విచారణకు...

చంద్రబాబు సంచలన ప్రకటన.....

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు...

జగన్ రెడ్డి కాదా.....

త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన...

వైసీపీ ఒక్క సీటు...

ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది....

పోల్స్